Begin typing your search above and press return to search.

స‌మంతతో ఆ భామ పైటింగులా?

స‌మంత మ‌ళ్లీ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదిత్యారాయ్ క‌పూర్ తో వెబ్ సిరీస్ లో న‌టించ‌డానికి రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   21 July 2024 9:30 AM GMT
స‌మంతతో ఆ భామ పైటింగులా?
X

స‌మంత మ‌ళ్లీ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదిత్యారాయ్ క‌పూర్ తో వెబ్ సిరీస్ లో న‌టించ‌డానికి రెడీ అవుతోంది. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ ని 'తుంబాడ్' ఫేం రాహి అనీల్ బ‌ర్వే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ తో ప్రేక్ష‌కుల్ని ఓ కొత్త వ‌ర‌ల్డ్ లోకి తీసుకెళ్ల‌బోతున్నారుట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన వెబ్ సిరీస్ ల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని స‌మాచారం.

ఇందులో స‌మంత భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో క‌నిపించ‌నుంద‌ని ఇప్ప‌టికే లీకైంది. ఆ పాత్ర వర్కౌట్ అయితే స‌మంత ఇమేజ్ కూడా మారిపోతుంద‌ని యూనిట్ వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో స‌మంత‌కు పోటీగా, ఆమెని ఢీకొట్టే పాత్ర కోసం వామికా గ‌బ్బిని ఎంపిక చేసారుట‌. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు సిరీస్ కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని అంటున్నారు.

అదే జ‌రిగితే స‌మంత రేంజ్ రెట్టింపు అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ స‌మంత యాక్ష‌న్ నేప‌థ్యంతో కూడిన సినిమాలుగానీ, వెబ్ సిరీస్ గానీ చేయ‌లేదు. ఇండియ‌న్ వెర్ష‌న్ 'సీటాడెల్' లో న‌టించింది. కానీ అది ఇంకా రిలీజ్ అవ్వ‌లేదు. అందులో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో క‌నిపిస్తుంది. ఇంత‌లో మ‌రో వెబ్ సిరీస్ లో ఆస‌క్తిక‌ర పాత్ర‌తో సామ్ పేరు మోతెక్కుతోంది.

ఈ వెబ్ సిరీస్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఆ టైటిల్ 'ర‌క్త‌బ్ర‌హ్మాండ్'. టైటిల్ యూనిక్ గా ఉంది. ఎన్ని భాష‌ల్లోనైనా ఇదే టైటిల్ తో రిలీజ్ చేయోచ్చు. అలాగే స‌మంత బాలీవుడ్ లో సినిమాలు చేయ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అమెరికా నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత ఆ ప‌నుల్లోనే బిజీ అయింది. ఆమె నుంచి సినిమా ప్ర‌క‌ట‌న ఎప్పుడొస్తుందా? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.