Begin typing your search above and press return to search.

సూటులోన సంపుతున్న స‌మంత‌

కానీ టాలీవుడ్ నుంచి అలాంటి చురుకైన వ్య‌క్తిత్వం ఎవ‌రికి ఉంది? అంటే స‌మంత గురించే ప్ర‌స్థావించాలి

By:  Tupaki Desk   |   11 March 2024 5:44 PM GMT
సూటులోన సంపుతున్న స‌మంత‌
X

ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగా ప్ర‌యోగాల‌కు దిగ‌డంలో స‌మంత‌ను మించే వారు లేరు. బాలీవుడ్ లో అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్, దిశా ప‌టానీ లాంటి అగ్ర క‌థానాయిక‌లు ప్ర‌యోగాల‌తో నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తుంటారు. కానీ టాలీవుడ్ నుంచి అలాంటి చురుకైన వ్య‌క్తిత్వం ఎవ‌రికి ఉంది? అంటే స‌మంత గురించే ప్ర‌స్థావించాలి.

సామ్ ఇప్పుడు సూటులోన స్పెష‌ల్ లుక్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. సమంత రూత్ ప్రభు లుక్ లో బాస్ వైబ్స్ క‌నిపిస్తున్నా ఇందులో నాటీ యాంగిల్ ని ఎవ‌రూ మ‌ర్చిపోవ‌డం లేదు. తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో స‌మంత‌ చాలా అందంగా కనిపించింది. సమంతా అద్భుతమైన లుక్ మాత్ర‌మే అంద‌రి దృష్టిని ఆకర్షించింది. సిటాడెల్ సహనటుడు వరుణ్ ధావన్ దీనిపై త‌న‌దైన శైలిలో స్పందించాడు.

సమంత ఫోటోషూట్ పై స్పందిస్తూ.. కోస్టార్ వ‌రుణ్ ధావ‌న్ ఫైర్ ఎమోజీని షేర్ చేసాడు. సమంత తెల్లటి ప్యాంట్‌సూట్‌లో గోల్డెన్ మెరుపుల‌తో ఆకర్షణీయంగా కనిపించింది. స్టేట్‌మెంట్ గోల్డ్ .. ముత్యాల చెవిపోగులతో తన రూపాన్ని స్పెష‌ల్ గా మార్చింది సామ్. ఈ బంచ్‌కి పిచ్చి ప్రేమ అని క్యాప్షన్ ఇచ్చింది.

సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కోసం గతంలో నటనకు విరామం ఇచ్చింది. ఆమె ఇప్పుడు తిరిగి పనిలోకి వచ్చింది. ఇటీవ‌ల హెల్త్ పోడ్‌కాస్ట్‌పై పని చేయడం ప్రారంభించింది. సినిమాల విషయానికొస్తే, సమంతా సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లో కనిపిస్తుంది. ఇందులో వరుణ్ ధావన్ కూడా నటించారు రాజ్ అండ్ డికె తెర‌కెక్కించారు. అమెరికన్ స్పై-థ్రిల్లర్ భారతీయ అనుసరణలో ఆమె హనీ గంభీర్ పాత్రను పోషించింది. జూలై 2023లో సిటాడెల్ ఇండియా షూటింగ్‌ను ముగించిన తర్వాత సమంత తన నటనకు విరామం ప్రకటించింది. ఆ తర్వాత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో కనిపించింది.