గతంలో పొరపాట్లు చేసాను - సమంత
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత చివరిగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది
By: Tupaki Desk | 29 Jun 2024 1:30 AM GMTసౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత చివరిగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోకస్ అంతా హిందీ సినిమాలపైన ఉందనే మాట వినిపిస్తోంది. తెలుగులో అయితే కేవలం ఫీమేల్ సెంట్రిక్ కథలు మాత్రమే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంట. లేదంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తుందంట.
ఆమె రెండేళ్ల క్రితం మాయోసైటిస్ బారిన పడింది. ఏడాది పాటు దానికి ట్రీట్మెంట్ తీసుకొని బయటపడింది. తరువాత ఖుషి మూవీ కంప్లీట్ చేసి కొంతకాలం సినిమాలకి విరామం ఇచ్చింది. శారీరక, మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి తీసుకున్నట్లు టాక్. మరల ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడం కోసం సిద్ధమైంది. ఆ మధ్య నిర్మాతగా మారి ప్రొడక్షన్ హౌస్ కూడా సమంత స్టార్ట్ చేసింది.
తన ప్రొడక్షన్ లో బంగారం అనే మూవీని కూడా ఎనౌన్స్ చేసింది. ఈ సినిమాలో సమంతనే లీడ్ రోల్ చేయనుంది. ఇదిలా ఉంటే కొంత కాలం నుంచి ఈ బ్యూటీ ఆరోగ్యంపై పాడ్ కాస్ట్ చేస్తోంది. ఆల్కేష్ సహోత్రితో కలిసి టేక్ 20 అనే పేరుతో పాడ్ కాస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ఆరోగ్యానికి సంబందించిన టిప్స్ ని ఫ్యాన్స్ తో సమంత పంచుకుంది. ఆరోగ్యకరమైన ఫుడ్స్ ని పాడ్ కాస్ట్ ద్వారా సమంత ప్రమోట్ చేస్తోంది.
ఇందులో ఓ నెటిజన్ సమంత చెబుతున్న ఆరోగ్యకరమైన టిప్స్ పై కామెంట్ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉన్నాయి. గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు కదా దానికి ఏం సమాధానం చెబుతారని అడిగాడు. సమంత ఆ కామెంట్ పై రియాక్ట్ అయ్యింది. గతంలో నేను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే. అయితే అవి పూర్తిగా తెలియక చేసినవి మాత్రమే అని సమంత పేర్కొంది.
తెలుసుకున్న తర్వాత అన్నింటిని పూర్తిగా ఆపేసాను. ఇప్పుడు నేను ఏవైతే ఆచరిస్తున్నానో అవి మాత్రమే చెబుతున్నాను అని సమంత పేర్కొంది. సమంత పాడ్ కాస్ట్ ద్వారా చెబుతోన్న ఆరోగ్య సూచనలు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రజలలో కూడా హెల్త్ కాన్సిస్ బాగా పెరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు తీసుకోవడం, హెల్త్ టిప్స్ ఫాలో కావడం చేస్తున్నారు.