Begin typing your search above and press return to search.

సమంత‌కు మార్వ‌ల్ సినిమాలో ఆఫ‌ర్?

టాలీవుడ్ నుంచి గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగిన స‌మంత పాపుల‌ర్ సిటాడెల్ తెలుగు వెర్ష‌న్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Nov 2023 11:37 AM GMT
సమంత‌కు మార్వ‌ల్ సినిమాలో ఆఫ‌ర్?
X

టాలీవుడ్ నుంచి గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగిన స‌మంత పాపుల‌ర్ సిటాడెల్ తెలుగు వెర్ష‌న్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అవెంజ‌ర్స్ డైరెక్ట‌ర్స్ రూపొందించిన సిటాడెల్ కి భార‌తీయ వెర్ష‌న్ కి సూప‌ర్ స్టార్ స‌మంత ప‌ర్ఫెక్ట్ అని భావించి ఎంపిక చేయ‌డ‌మే ఒక ఘ‌న‌త అనుకుంటే, ఇప్పుడు ఏకంగా మార్వ‌ల్ క్వీన్ గా వెలిగిపోతోంది సామ్.


సమంత అభిమానుల కోసం ప్ర‌త్యేక‌ దీపావళి సర్ప్రైజ్ ను అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న 'దిమార్వెల్స్'తో జతకట్టింది! భారతీయ అభిమానుల కోసం ప్ర‌త్యేక ప్రోమోను లాంచ్ చేసింది.


ఈ దీపావళికి, ఈ పండుగ సీజన్లో గొప్ప యాక్షన్, అడ్వెంచర్..పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ మార్వెల్ స్టూడియోస్ 'ది మార్వెల్స్' నవంబర్ 10న విడుదల కానుండగా, మరింత ఉన్నతంగా పండుగను సెలెబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది!


ఈ సంవత్సరం దీపావ‌ళిని సమంత ప్ర‌త్యేకంగా మార్చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో భారతీయ అభిమానుల కోసం ప్ర‌త్యేక వీడియోను విడుదల చేసి అభిమానులలో జోష్ పెంచారు. అలాగే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా రేపు, నవంబర్ 4న అన్ని ఫార్మాట్లలో ముందస్తు బుకింగులు ప్రారంభమవుతాయని పక్రటించారు!


2019 బ్లాక బస్టర్ హిట్ 'కెప్టెన్ మార్వెల్' కోసం మార్వెల్ స్టూడియోస్ తో చిరస్మరణీయ అనుబంధం తర్వాత, ఎల్లప్పుడూ నిజమైన బ్లూ సూపర్ హీరో అభిమాని అయిన సమంత, సినిమా కోసం తన ఉత్సాహాన్ని తన అసమానమైన శైలిలో ప్రేక్షకులతో పంచుకుని, వారిని స్వాగతించడానికి తిరిగి వచ్చింది. సమంత హైదరాబాద్ లో 'ది మార్వెల్స్ ' కోసం ప్ర‌త్యేక వీడియోను ఆవిష్కరించినప్పు డు, ఆమె తన సూపర్ హీరో గురించి తన ఎక్సైట్ మెంట్ ని తెలియజేసింది. వారి సినిమా పై తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి సినిమా పాత్ర‌ల‌ గెటప్ లలో వచ్చిన ప్ర‌త్యేక అభిమానుల తో పవర్-పోజ్ ఇచ్చింది!


ది మార్వెల్స్ గురించి సమంత మాట్లాడుతూ "కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో మరియు అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్ టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడానికినేను థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నా ను. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు! మార్వెల్స్ సినిమా థియేటర్ లలో ఎపిక్ యాక్షన్-ప్యా క్డ్ ఎంటర్టైనింగ్ రైడ్ లాగా మనకు ముందుకు వస్తుంది. ఈ దీపావళికి పెద్ద స్క్రీన్ పైనే చూడటానికి నేను ఉత్సహంగా ఎదురుచూస్తున్నా ను!'' అని అన్నా రు. మార్వెల్ స్టూడియోస్ 'దిమార్వెల్స్' ఈ దీపావళికి నవంబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో థియేటర్ల లోకి వస్తుంది. అయితే స‌మంత మార్వ‌ల్ నుంచి వ‌చ్చే సినిమాకి ప్ర‌మోట‌ర్ గా మాత్ర‌మే కాదు.. మార్వ‌ల్ నిర్మించే సినిమాలో న‌టిగా కొన‌సాగాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.