Begin typing your search above and press return to search.

స‌మంత ర‌హ‌స్య ప్ర‌పంచం ఎవ‌రికైనా తెలుసా?

స‌మంత రూత్ ప్ర‌భు ఎవ‌రికీ తెలియ‌ని ఓ ర‌హ‌స్య ప్ర‌పంచంలోకి వెళ్లిపోతోందా? అంటే అవున‌నే అంటున్నారు

By:  Tupaki Desk   |   21 July 2024 3:30 PM GMT
స‌మంత ర‌హ‌స్య ప్ర‌పంచం ఎవ‌రికైనా తెలుసా?
X

స‌మంత రూత్ ప్ర‌భు ఎవ‌రికీ తెలియ‌ని ఓ ర‌హ‌స్య ప్ర‌పంచంలోకి వెళ్లిపోతోందా? అంటే అవున‌నే అంటున్నారు. అయితే ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా? అనే సందేహాలు ఎవ‌రికైనా క‌ల‌గ‌డం స‌హ‌జం. వివ‌రాల్లోకి వెళితే.. స‌మంత రూత్ ప్ర‌భు ఇటీవ‌ల కొన్ని వ్య‌క్తిగ‌త ఎపిసోడ్ల త‌ర్వాత 'ఖుషి' అనే రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోతోంది అంటూ ప్ర‌చారం సాగినా అవ‌న్నీ పుకార్లుగానే మిగిలాయి.

అక్క‌డ స‌ల్మాన్, షారూఖ్ వంటి పెద్ద స్టార్ల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్రచారం సాగింది. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ ఇప్పుడు త‌న స్నేహితులు రాజ్ అండ్ డీకేతో క‌లిసి ముచ్చ‌ట‌గా మూడోసారి పాన్ ఇండియ‌న్ ప్రాజెక్ట్ కోసం ప‌ని చేయ‌నుంది. అది కూడా ఓ వెబ్ సిరీస్ కోసం. ఈ సిరీస్ నిజంగా ఉత్కంఠ రేకెత్తించే ఎలిమెంట్స్ తో తెర‌కెక్క‌నుంది. ఇంకా చెప్పాలంటే అనేక అవార్డులు రివార్డుల‌తో సంచ‌ల‌నం సృష్టించిన 'తుంబాద్' త‌ర‌హాలో ఒక ర‌హ‌స్య ప్ర‌పంచంలో సాగే క‌థ‌లోకి స‌మంత వెళ్లిపోనుంద‌ట‌. ఇందులో సామ్ పాత్ర కూడా అంతే ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈసారి తుంబాద్ ద‌ర్శ‌కుడు రాహి అనీల్ బార్వే రూపొందించ‌నున్న తాజా వెబ్ సిరీస్ టైటిలే ఉత్కంఠ‌ను పెంచింది.

ర‌క్త్ బ్ర‌హ్మాండ్-అనేది టైటిల్. టైటిల్ కి త‌గ్గ‌ట్టే క‌థాంశం ఉత్కంఠ క‌లిగిస్తుంద‌ని చెబుతున్నారు. అభిమానం, కుట్రలు, ప్రేమ, త్యాగం, విధితో కూడిన ఉత్కంఠభరితమైన క‌థ‌ను తెర‌పై చూపించ‌నున్నార‌ట‌. ఒక ప్ర‌త్యేక‌మైన ర‌హ‌స్య ప్ర‌పంచంలోకి ఆడియెన్ ని తీసుకెళ్లేందుకు క్ష‌ణ‌క్ష‌ణం టెన్ష‌న్ ను అనుభ‌వించేందుకు అవ‌స‌ర‌మైన స‌రంజామాను ద‌ర్శ‌కుడు సిద్ధం చేసార‌ట‌. దీనిని తొలుత సినిమాగా తీయాల‌నుకున్నా క‌థ స్పాన్ ప‌రంగా పున‌రాలోచించి ఒక వెబ్ సిరీస్ అయితే న్యాయం చేయ‌గ‌ల‌మ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇలా ప్లాన్ చేసార‌ని తెలిసింది.

అయితే ఈ సిరీస్ లో స‌మంత పాత్ర ఎలా ఉంటుందో మాత్రం ద‌ర్శ‌కుడు ఇంకా రివీల్ చేయ‌లేదు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి ఇత‌ర పాత్రధారులు. రాజ్ అండ్ DK క్రియేటివ్ పార్ట్ లో ఉన్నారు. నిర్మాత‌లుగా కొన‌సాగుతారు. ఫ్యామిలీమ్యాన్ 2, సిటాడెల్: హనీ బన్నీ త‌ర్వాత రాజ్ అండ్ డీకేతో స‌మంత‌కు మూడో అవ‌కాశం ఇది. మ‌రోసారి త‌న బ్రాండ్ ని పెంచే సిరీస్ ని వారు అందిస్తార‌ని స‌మంత న‌మ్మ‌కంగా ఉంది. ముఖ్యంగా తుంబాద్ ద‌ర్శ‌కుడి క్రియేటివ్ ప్ర‌పంచం త‌న‌కు మంచి పేరు తెస్తుంద‌ని కూడా స‌మంత భావిస్తోంద‌ట‌. స‌మంత ఈ సిరీస్ తో పాటు ఒకే ఒక్క సినిమాలో న‌టిస్తోంది. అది కూడా త‌న సొంత బ్యాన‌ర్ సినిమా. బంగారం అనే టైటిల్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.