Begin typing your search above and press return to search.

సమంతను ట్రోల్స్​కు గురి చేసిన విజయ్​ దేవరకొండ

"ఓ రోజు షూటింగ్ సమయంలో దర్శకుడు శివ నిర్వాణ వేసుకున్న తన భార్య టాటూ చేసి సామ్​ షాకైంది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 7:57 AM GMT
సమంతను ట్రోల్స్​కు గురి చేసిన విజయ్​ దేవరకొండ
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడు ఏదో ఒక విషయంలో సోషల్​ మీడియాలో, టెలివిజన్ మీడియాలో ట్రోలింగ్​, ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. చాలా సార్లు కాంట్రవర్సీలకు కూడా గురైంది. అయితే ఆమెకు హేటర్స్​ ఎంత మంది ఉన్నా.. అదే సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచేవారు అంతే మంది ఉన్నారు. విషయానికొస్తే ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి టోల్స్​కు గురైంది. అది కూడా విజయ్​ దేవరకొండ కామెంట్స్​ వల్ల.

ప్రస్తుతం విజయ్​-సమంత కలిసి 'ఖుషి' అనే లవ్​ అండ్​ ఫ్యామిలీ ఎంటర్​టైన్మెంట్​ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్​ 1న గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీటీమ్​ ప్రమోషన్స్​ చేస్తోంది. విజయ్​ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ సమంత మాత్రం తన పర్సనల్​ రీజన్స్​తో అమెరికా టూర్​కు వెళ్లిపోయింది.

కానీ ఆమె కూడా విజయ్​తో కలిసి ఇప్పటికే రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే వీటిలోని ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి విజయ్​ చేసిన కామెంట్స్​ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విజయ్ మాట్లాడుతూ.. "ఓ రోజు షూటింగ్ సమయంలో దర్శకుడు శివ నిర్వాణ వేసుకున్న తన భార్య టాటూ చేసి సామ్​ షాకైంది. అప్పుడు ఆమె 'నువ్వు పెద్ద తప్పు చేశావ్'​ అని శివతో చెప్పింది" అని గుర్తుచేసుకున్నాడు.

ఇక ఈ కామెంట్స్​ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్​ వైరల్ అయ్యాయి. మీమర్స్​ అయితే మీమ్స్​ రూపంలో సమంత కామెంట్స్​ను తెగ షేర్ చేస్తున్నారు. సమంత తనకు డివొర్స్​ అయిన కారణంగా, అన్నీ జంటలకు ఎప్పటికైనా డివొర్స్​ అవ్వాల్సిందేనన్న కోణంలో శివతో అలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. ఆమె కామెంట్స్​ను తప్పుబడుతూ ట్రోల్స్​ చేస్తున్నారు.

అయితే ఇదే సమయంలో ఇంకొంతమంది సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. 'నిజానికి సమంత దర్శకుడితో ఉన్న చనువుతో అలా సరదాగా కామెంట్స్​ చేసింది' అని చెబుతున్నారు. అక్కడి కాంటెక్ట్స్​ను చాలా అర్థంచేసుకోవట్లేదని పేర్కొంటున్నారు. కావాలనే కొంతమంది ఇలాంటి చీప్​ ట్రోల్స్​ చేస్తున్నారని మండిపడుతున్నారు.