కొండ కోనలు జలకాల్లో ప్రేమను వెతికిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కొంతకాలంగా షూటింగులకు విరామం ఇచ్చి, తనదైన పంథాలో విహారయాత్రలతో బిజీగా ఉన్నారు.
By: Tupaki Desk | 24 Feb 2024 3:53 AM GMTస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కొంతకాలంగా షూటింగులకు విరామం ఇచ్చి, తనదైన పంథాలో విహారయాత్రలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మలేషియాలోని కొండ కోనలు జలకాల్లో తనకు కావాల్సిన ప్రేమను సమంత వెతుకుతున్నారు. ఇదిగో ఇది `హైయ్యెస్ట్ లవ్` అంటూ ఒక స్పెషల్ ఫోటోషూట్‌ని సమంత షేర్ చేసింది.
సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలో తన వెకేషన్ ని ఆస్వాధిస్తున్న కొత్త ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. కొండలు కోనలు జలపాతాలు వంటి సుందరమైన ప్రదేశాలలో విహారయాత్రతో సామ్ అబ్బురపరుస్తోంది. ఇంతకుముందే యోగ సాధన చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు గోధుమ రంగు బికినీ ధరించి స్వచ్ఛమైన జలపాతంలో జలకాలాడుతూ కనిపించింది.
అత్యున్నత ప్రేమ (వైట్ హార్ట్ ఎమోటికాన్) అనేది సమంత రూత్ ప్రభు తన తాజా పోస్ట్ కి ఇచ్చిన క్యాప్షన్. మలేషియా విహారయాత్ర నుండి సమంత చాలా ఫోటోలను షేర్ చేసింది. దటాయ్- లంకావీలో బస చేసిన ప్రదేశాన్ని కూడా సామ్ జియోట్యాగ్ చేసింది. మొదటి ఫోటోలో గోధుమ రంగు బికినీలో కనిపించింది. ఒక అందమైన ప్రకృతి సిద్ధమైన కొలనులో జలకాలాడుతూ ఆనందించింది. రెండవ ఫోటోలో తన బసలోని ప్రశాంతమైన ప్రాంగణంలో ధ్యానం చేస్తూ కనిపించింది. ఈ ప్రదేశం లో చుట్టూ కొండలు కోనలు చెట్లతో పచ్చదనం చెక్క ఇళ్ళు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఒక ఫోటోలో 36 సంవత్సరాల వయస్సులో 50.1 కిలోల బరువును కలిగి ఉన్నట్టు .. 23 సంవత్సరాల జీవక్రియ వయస్సు కలిగి ఉన్నట్లు వెల్లడించింది. మరొక ఫోటోలో నేపథ్యంలో పచ్చదనం మధ్య ఆరుబయట పని చేస్తూ కనిపించింది. ``ఎప్పటికీ ఉదయం సూర్యుడిని వెతుకుతూ... ఉత్తమమైన ఉదయం``అని క్యాప్షన్‌లో రాసింది.
గత ఏడాది జూలైలో సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కనీసం ఒక సంవత్సరం పాటు తన ప్రాజెక్ట్‌లకు విరామం ప్రకటించింది. స్వయం ప్రతిరక్షక స్థితి అయిన మైయోసిటిస్‌కు అమెరికాలో చికిత్స పొందింది. ప్రపంచవ్యాప్తంగా పర్యటించింది. తాను పనిని తిరిగి ప్రారంభిస్తానని గత వారంలో వెల్లడించింది. సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండతో తన రెండవ తెలుగు చిత్రం ఖుషిలో కనిపించింది. మహానటి తర్వాత ఈ జంట కలయికలో రెండో చిత్రమిది. గతేడాది సెప్టెంబర్ 1న విడుదలైంది. తదుపరి రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో కనిపించనుంది. సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు సమంత రెడీ అవుతోందని సమాచారం. మరోవైపు సల్మాన్ ఖాన్ సరసన సమంత కథానాయికగా నటించే అవకాశం ఉందని కూడా కథనాలొస్తున్నాయి.