Begin typing your search above and press return to search.

సామ్ స్టన్నింగ్ లుక్.. పొట్టి నిక్కరులో అలా..

అద్దం ముందు నిలుచొని ఫొటో దిగిన సామ్ చిన్న నిక్కరులో అందంగా కనిపించింది. అలాగే కాస్త సన్నబడినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   25 Jun 2024 9:41 AM GMT
సామ్ స్టన్నింగ్ లుక్.. పొట్టి నిక్కరులో అలా..
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, హెల్త్ అప్‌డేట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా, సమంత తన కొత్త ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్' పై 'మా ఇంటి బంగారం' అనే సినిమా అనౌన్స్ చేసింది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ కాలేదని టాక్. త్వరలోనే ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు, సమంత మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో పోరాడుతుందని మరియు ఇంకా చికిత్స తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై సమంత వ్యక్తిగతంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఇటీవల ఈషా ఫౌండేషన్ సద్గురు వద్ద ధ్యానం చేస్తున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీనితో, ఆమె ఆరోగ్యం గురించి మరింత చర్చ జరుగుతోంది.

అలాగే అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా ఉంటున్నాయి. రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలలో ఒకటి మరింత ట్రెండ్ అవుతోంది. అద్దం ముందు నిలుచొని ఫొటో దిగిన సామ్ చిన్న నిక్కరులో అందంగా కనిపించింది. అలాగే కాస్త సన్నబడినట్లు తెలుస్తోంది. ఆమె ఫిట్నెస్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో ఈ ఫొటో చెబుతోంది.

ఇక తొలిసారిగా సమంత వెబ్ సిరీస్ "సిటాడెల్: హనీ బన్నీ" లో నటించింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత సమంత మరో ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశముందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు, సమంత మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

సమంత ఇప్పటివరకు మలయాళంలో ఎలాంటి సినిమా చేయలేదు. కానీ, ఇప్పుడు ఆమె మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ థ్రిల్లర్ సినిమా ఎక్కువగా చెన్నైలో షూట్ చేయనున్నట్లు టాక్. ఈ సినిమాలో ముందుగా నయనతారను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ ఆమె వ్యక్తిగత కారణాలు, వర్క్ కమిట్మెంట్స్ కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంతో, సమంతకు ఈ బిగ్ ఆఫర్ దక్కింది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. మమ్ముట్టి సినిమా నుంచి నయనతార తప్పుకోవడం వెనుక పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఆమె రోల్ పరంగా నచ్చక వదులుకుందన్నారు. మరికొందరు, యష్ టాక్సిక్ సినిమా చేసేందుకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి బయటపడ్డారని అన్నారు. ఇక, మేకర్స్ తో వ్యక్తిగత విభేదాల వల్లనూ ఈ నిర్ణయం తీసుకుందని ఇతరులు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, సమంత తన మాలీవుడ్ డెబ్యూ తో మంచి హిట్ కొడుతుందో చూడాలి.