3400 ఏళ్ల చరిత్ర కలిగిన నగరంలో సమంత
అది కూడా గ్రీస్ దేశంలో ఏథెన్స్ లో. ఏథెన్స్ నగరానికి ఉన్న పురాతన చరిత్ర, ప్రత్యేకత గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2024 3:21 PM GMTసమస్య ఏదైనా ఎదురీదగలిగే ధీరత్వం సమంత రూత్ ప్రభు సొంతం. కెరీర్ అత్యుత్తమ ఫేజ్ లో ఉండగా రెండు వరుస దెబ్బలను సామ్ ఊహించలేదు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది.. మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యను ఢీకొంది. అయినా ధైర్యంగా ప్రతిదీ ఎదుర్కొంది. ఇప్పుడు తిరిగి కథానాయికగా కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది. ఇలాంటి కంబ్యాక్ వేరొకరికి సాధ్యం కాదేమో! అందుకే ఈసారి బర్త్ డేను విదేశాల్లో వెరీ స్పెషల్ గా జరుపుకుంది. అది కూడా గ్రీస్ దేశంలో ఏథెన్స్ లో. ఏథెన్స్ నగరానికి ఉన్న పురాతన చరిత్ర, ప్రత్యేకత గురించి తెలిసిందే.
సమంత రూత్ ప్రభు తన 37వ పుట్టినరోజును సుందర నగరమైన ఏథెన్స్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సామ్ జీవితకాలం జ్ఞాపకాలను పదిలపరుచుకునే అరుదైన సందర్భమిది. ఈ ఫోటోల్లో గ్రీక్ రాజధాని అద్భుతమైన పురాతన వాస్తుశిల్పం, శక్తివంతమైన కట్టడాలతో గొప్ప సంస్కృతి కనిపిస్తోంది. సమంతా అన్వేషణ, సాహసం, స్థానిక వంటకాలతో విందు ప్రతిదీ ఫోటోల్లో హైలైట్ గా కనిపిస్తున్నాయ్. పుట్టినరోజు ఆల్బమ్‌లో సమంతా డెజర్ట్‌ల సేవనంలో మునిగిపోయిన ఫోటోలు, స్థానిక ప్రదేశాల అరుదైన ఫోటోగ్రాఫ్స్ హైలైట్ గా ఉన్నాయి. ఏథెన్స్ లో విలాసవంతమైన హోటల్ గది నుండి వీక్షణ.. ఏథెన్స్ వీధుల్లో రాత్రి జీవితానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు విరివిగా ఆన్ లైన్ లో షేర్ అవుతున్నాయి. సామ్ తన స్నేహితులతో ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది.
బర్త్ డే బేబి వైట్ డ్రెస్ ప్రత్యేకంగా ఉంది. తెల్లటి టాప్, బేస్ బాల్ క్యాప్, షేడ్స్ ధరించి సంతోషకరమైన సెల్ఫీతో కనిపించింది. ఆ మెడలో ఈవిల్ ఐ లాకెట్టు చాలా ప్రత్యేకం. కేవలం వైట్ హార్ట్ ఎమోజితో పాటు ఏథెన్స్‌కు ప్రత్యేకమైన క్యాప్షన్ ఇచ్చింది. సామ్ తాజా పోస్ట్ కి ప్రతిస్పందనగా అభిమానులు ప్రేమను కురిపించారు. ``నేను ఈ ఒక్క పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా రాణి`` అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ``ఆమె సంతోషకరమైన ముఖం నాకు అంతులేని ఆనందాన్ని ఇస్తోంది`` అని మరొక అభిమాని ప్రేమను కురిపించారు. చాలామంది అభిమానులు సమంతను ప్రేమిస్తున్నామని వ్యాఖ్యానించారు.
తన 37వ పుట్టినరోజును పురస్కరించుకుని సమంత కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఇది నిర్మాతగా తన తొలి ప్రయత్నాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. పోస్టర్‌లో సమంత భీకరమైన అవతార్‌లో తుపాకీ పట్టుకుని ముఖంపై రక్తంతో కనిపించింది. ఈ సినిమా టైటిల్ బంగారం. త్వరలో షూటింగ్ ప్రారంభించి 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఏథెన్స్ చరిత్ర:
ఎథీనా నుంచి ఏథెన్స్ అనే పేరు వచ్చింది. ఇది ఒక దేవత పేరు. ఏథెన్స్ దేవత ఎథీనాతో సంబంధం కలిగి ఉంది. చారిత్రకంగా చూస్తే.. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఏథెన్స్ ఒకటిగా ఉంది. 3,400 సంవత్సరాలకు పైబడిన చరిత్రను కలిగి ఉంది.