23 వయసు అబ్బాయి.. నువ్వు నన్ను ఆశ్చర్యపరిచావు
తేజ సజ్జా నటించిన హనుమాన్ ఈ సంక్రాంతి బరిలో క్లీన్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Jan 2024 4:41 AM GMTతేజ సజ్జా నటించిన హనుమాన్ ఈ సంక్రాంతి బరిలో క్లీన్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అన్ని పెద్ద సినిమాలను పక్కన పెట్టి, ఈ పరిమిత బడ్జెట్ సినిమాని క్రిటిక్స్ ఆకాశానికెత్తేసారు. కథ కంటెంట్ నటన వీఎఫ్ ఎక్స్ పనితనం ఇలా అన్ని విభాగాల్లో మంచి స్కోర్ చేసింది హనుమ్యాన్. ఈ సినిమాని వీక్షించిన సెలబ్రిటీలంతా ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించారు.
పలువురు స్టార్లు హనుమ్యాన్ గొప్ప సినిమా అంటూ కీర్తించారు. ఇప్పుడు ఈ జాబితాలో సమంత రూత్ ప్రభు చేరింది. ఈ సినిమా చూశాక తాను చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లానంటూ సామ్ వ్యాఖ్యానించింది. సమంతా ఈ చిత్రాన్ని ఎంతగా ఇష్టపడిందో ఇన్ స్టాలో వెల్లడించింది. సినిమా చూసేప్పుడు తనను విస్మయానికి గురిచేసే అనేక అంశాల గురించి వివరణాత్మక నోట్ ని షేర్ చేసింది. సమంతా రూత్ ప్రభు ఈ నోట్ లో ఇలా రాశారు, ''మనల్ని మళ్లీ చిన్నపిల్లలా నాటి రోజుల్లోకి తీసుకెళ్లే ఇలాంటి సినిమాలు ఎప్పటికీ ఉత్తమమైనవి. అద్భుతమైన విజువల్స్, సినిమాటిక్ హైస్, హాస్యం, మ్యాజిక్ .. అద్భుతమైన సంగీతం, విజువల్స్ .. నట ప్రదర్శనలతో సినిమా ఆద్యంతం కట్టిపడేసింది. హనుమాన్ ని ఆవిష్కరించిన తాంత్రికుడికి ధన్యవాదాలు.. ప్రశాంత్ వర్మ మీ విశ్వం లో తదుపరి అధ్యాయాల గురించి ఇంకా వేచి ఉండలేను'' అని రాసింది. సమంత తన నోట్‌లో తేజ సజ్జను ప్రశంసించింది. తేజ సజ్జా.. 23 వయసు అబ్బాయి.. నువ్వు నన్ను ఆశ్చర్యపరిచావు... నీ కామెడీ టైమింగ్, నీ అమాయకత్వం .. హనుమంతునిగా అద్భుతమైన ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హార్ట్. సంగీతం వీఎఫ్ ఎక్స్ ఈ అద్భుతమైన ప్యాకేజీని చాలా అందంగా కట్టివేసాయి. ఈ ప్రయత్నం నాలోను కోరికలను మిగిల్చింది. నటీనటులకు అభినందనలు`` అని వ్యాఖ్యానించారు.
తేజ సజ్జా నటించిన హను మ్యాన్ ఇటీవలి యాక్షన్-అడ్వెంచర్ ఫాంటసీ సినిమాలలో ఒకటి. ప్రశాంత్ వర్మ రచించి, దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ డ్రామా జనవరి 12 న థియేటర్‌లలోకి వచ్చింది. మహేష్ బాబు నటించిన యాక్షన్ చిత్రం గుంటూరు కారంతో ఢీకొట్టినా కానీ.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది. హనుమాన్ ఇలాంటి అరుదైన ఫీట్ సాధించడంపై దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేసారు. ప్రశాంత్ వర్మ స్వయంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూళ్లు సాధించింది! అంటూ కొత్త హనుమాన్ పోస్టర్‌ను షేర్ చేసి, నా మొదటి సెంచరీ! అని ఆనందం వ్యక్తం చేసాడు.
తేజ సజ్జా, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, కౌశిక్ మహత, వెన్నెల కిషోర్, సత్య, రాజ్ దీపక్ శెట్టి, భాను ప్రకాష్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. హనుమాన్ మొదటి భారతీయ సూపర్ హీరో చిత్రం అంటూ ప్రశాంత్ వర్మ ఎంతో నమ్మకంగా చెప్పారు. చెప్పినదే చేసి చూపించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం తదితర భాషల్లో విడుదలైంది.