Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మెరుపుల చీరలో మెరుస్తున్న అందగత్తె

రెండు దశాబ్దాల క్రితం హిందీ బుల్లితెర ప్రేక్షకులకు యే మేరి లైఫ్ హై సీరియల్‌ తో పరిచయం అయిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌ ఇంకా కూడా తన సత్తా చాటుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 1:30 PM GMT
పిక్ టాక్ : మెరుపుల చీరలో మెరుస్తున్న అందగత్తె
X

రెండు దశాబ్దాల క్రితం హిందీ బుల్లితెర ప్రేక్షకులకు యే మేరి లైఫ్ హై సీరియల్‌ తో పరిచయం అయిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌ ఇంకా కూడా తన సత్తా చాటుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా తనకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశం ను సద్వినియోగం చేసుకుంటూ నాలుగు పదుల వయసులో కూడా దుమ్ము రేపుతోంది.


షామా సికిందర్ సోషల్‌ మీడియా ఫోటోలు మరియు వీడియోలను చూస్తే ఆమె వయసు నాలుగు పదులు దాటింది అంటే నమ్మశక్యంగా ఉండవు. పాతికేళ్ల అందాల అమ్మాయి అన్నట్లుగా ఉంటుంది. అలాంటి అందగత్తె కి ఇన్నాళ్లు దక్కాల్సిన విజయాలు దక్కలేదు అనేది చాలా మంది అభిప్రాయం.


తాజాగా మరోసారి సోషల్‌ మీడియా ద్వారా కుర్రకారుకు షాక్ ఇస్తూ షామా సికిందర్ ఈ చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసింది. మెరుపుల చీరలో మెరుస్తూ మతి పోడుతున్న షామా ఫోటోలు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రేంజ్ లో చీరతో అందంగా కనిపించడం ఈమెకే సాధ్యం అంటున్నారు.

షామా సికిందర్‌ హిందీలో బైపాస్ రోడ్‌ అనే సినిమాలో నటించి ఆ తర్వాత పెద్దగా కనిపించడం లేదు. మ్యూజిక్‌ వీడియోస్, సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్, బుల్లి తెర ఇలా అన్ని చోట్ల కూడా షామా బిజీగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోయిన్స్‌ రేంజ్‌ లో ఇన్‌ స్టాగ్రామ్‌ లో షామా సికిందర్ ఫోటోలు జనాల్లో రీచ్‌ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి.