పాపులర్ గాయనికి విడాకులిస్తున్న భర్త?
నిజానికి ఈ జంటకు వివాహం అయ్యి కేవలం ఏడాది మాత్రమే అయింది. 14 నెలల సంసారం తర్వాత ఈ జంట విడిపోయే వరకూ వెళ్లారు.
By: Tupaki Desk | 19 Aug 2023 2:45 AM GMTసెలబ్రిటీ ప్రపంచంలో రోజుకో విడాకుల కేసు అభిమానుల్లో కలతకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీస్పియర్స్ కు భర్త విడాకులు ఇచ్చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. బ్రిట్నీ స్పియర్స్ భర్త సామ్ అస్గారి విడాకుల కోసం దాఖలు చేసినట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు హైలైట్ అయ్యాయి.
నిజానికి ఈ జంటకు వివాహం అయ్యి కేవలం ఏడాది మాత్రమే అయింది. 14 నెలల సంసారం తర్వాత ఈ జంట విడిపోయే వరకూ వెళ్లారు. అయితే ఈ బ్రేకప్ కి కారణాలేమిటన్నది ఇంకా తెలియరాలేదు. పాపులర్ TMZలోని నివేదికల ప్రకారం.. సామ్ బ్రిట్నీపై 'మోసం నమ్మక ద్రోహం' అంటూ గొడవలకు దిగారని తెలుస్తోంది. ఒక వారం క్రితం.. సామ్ అస్గారి బ్రిట్నీ స్పియర్స్‌తో నమ్మకద్రోహం చేశావంటూ వాగ్వాదానికి దిగాడని సన్నిహితులు వెల్లడించినట్టు కథనాలొచ్చాయి. అయితే ఈ పుకారులో నిజం ఉందో లేదో అస్పష్టంగా ఉందని కూడా సదరు మీడియా రాసింది.
బ్రిట్నీతో గొడవ అనంతరం సామ్ అస్గారి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. సామ్ విడాకుల కోసం ఫైల్ చేయడానికి ముందు నిజానికి ఇది చిన్నపాటి గొడవగానే కనిపించినా కానీ అది పెనుకంపంగా మారిందని TMZ పేర్కొంది. బ్రిట్నీస్పియర్స్ ప్రవర్తన ''కొన్నిసార్లు అస్థిరంగా ఉండేద''ని తన భర్త సామ్ ఆస్గరీ ఆరోపించినట్టు కథనాలొచ్చాయి. అంతేకాదు అతడు తన లిమిటేషన్స్ ని దాటేసాడని ఈ నివేదిక చెబుతోంది. విడాకుల ప్రాసెస్ ఇంకా మొదలు కానప్పటికీ త్వరలో ఇది ముందుకు సాగే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి.
గమనించదగ్గ విషయం ఏమిటంటే బ్రిట్నీ స్పియర్స్ లేదా సామ్ అస్గారీ ఇంకా ఈ కథనాలు నిజమా కాదా? అన్నది ధృవీకరించలేదు. ఈ జంట 2016లో స్పియర్స్ స్లంబర్ పార్టీ మ్యూజిక్ వీడియో సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. జూన్ 2022లో పెళ్లి చేసుకున్నారు. కానీ ముచ్చటైన జంట ఏడాది తర్వాత బ్రేకప్ అవుతుండడం అభిమానులను కలచివేస్తోంది.