క్రిస్మస్ సెలబ్రేషన్స్ షురూ చేసిందే!
తన ఇల్లంతా అందంగా డెకరేట్ చేసి క్రిస్మస్ ట్రీని మధ్యలో పెట్టి అడ్వాన్స్ డ్ క్రిస్మస్ శుభాకాంకక్షలు చెప్పేసింది. ఆ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు..వీడియోని అభిమానులకు షేర్ చేసింది.
By: Tupaki Desk | 13 Dec 2023 2:30 PM GMTసమంత వెకేషన్ ఆస్వాదిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఖుషీ' ప్రచారం అనంతరం అమెరికా ప్లైట్ ఎక్కేసిన అమ్మడు అప్పటి నుంచి లైఫ్ ని రిలాక్స్ డ్ గా ఉండచమే పనిగా పెట్టుకుంది. మనసుకు నచ్చనిట్లు ఉంటూ ఎలాంటి టెన్షన్ లు తీసుకోకుండా రిలాక్స్ అవుతుంది. ఇండియాలో ఉంటే? ఇదంతా సాధ్యమ వ్వదనే అమెరికా చెక్కేసింది. అలాగే సినిమాలకు దూరమైంది లేదు.
ఓవైపు అవసరం మేర సినిమా వాళ్లతోనూ టచ్ లో ఉంటుంది. ఇక్కడ అప్ డేట్స అన్నింటిని తెలుసు కుంటుంది. వెకేషన్ లో భాగంగా అన్ని ప్రాంతాలు చుట్టేస్తోంది. ఇటీవలే భూటాన్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. తాను నిర్వహిస్తోన్న ఏకమ్ స్కూల్ కి వెళ్లి పిల్లలతో సరదాగా గడిపింది. అలాగే ప్రత్యూష పౌండే షన్ కి వెళ్లి అక్కడ కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో చూసుకుని వచ్చింది.
ఈ సందర్భంగా అక్కడి పిల్లలతో కలిసి 'హాయ్ నాన్న' సినిమా చూసి పిల్లల్లో సంతోషాన్ని నింపింది. తాజాగా అమ్మడు క్రిస్మస్ వేడుకలు షురూ చేసింది. క్రిస్మస్ కి ఇంకా కొన్ని రోజులు సమయం ఉందనగానే ముందస్తు వేడుకలు మొదలు పెట్టింది. తన ఇల్లంతా అందంగా డెకరేట్ చేసి క్రిస్మస్ ట్రీని మధ్యలో పెట్టి అడ్వాన్స్ డ్ క్రిస్మస్ శుభాకాంకక్షలు చెప్పేసింది. ఆ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు..వీడియోని అభిమానులకు షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత ఎంతో సంతోషంగా ఉన్న మూవ్ మెంట్ ఇది. అయితే అమెరికా వెళ్లిన బ్యూటీ హఠాత్తుగా మళ్లీ హైదరాబాద్ రావడం వెనుక అసలు కారణాలు ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. ఏడాది పాటు మళ్లీ హైదరాబాద్ వచ్చే అవకాశం లేదని భావించిన వాళ్లకు సమంత కంబ్యాక్ సర్ ప్రైజ్ గా అనిపిస్తుంది. అది భూటాను నుంచి రావడం మరింత ఆసక్తిక రంగా మారింది. మరి అనుకోకుండా చేసిన ఈ ప్లానింగ్ వెనుక ఇంకేదైనా? కారణం ఉందా? అన్నది తెలియాలి.