Begin typing your search above and press return to search.

సినీపరిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ గురించి న‌టుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్‌ను ఒకే సంస్థగా చూసే ధోరణి ఉందని, ప్రతి ఒక్కరూ అందరికీ కనెక్ట్ అయ్యే ఏకీకృత పరిశ్రమగా ప్రజలు భావిస్తారని అన్నారు.

By:  Tupaki Desk   |   3 Nov 2024 6:02 AM GMT
సినీపరిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ గురించి న‌టుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచార‌ణలో భాగంగా నార్కోటిక్స్ బ్యూరో (ఎన్సీబీ) హిందీ చిత్ర‌సీమ‌లో డ్ర‌గ్స్, పార్టీ క‌ల్చ‌ర్ గురించి ఆరా తీసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిరోజూ మీడియాలో దీని గురించి వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. బాలీవుడ్ ని ఇన్ సైడ‌ర్స్ కంట్రోల్ చేస్తుంటార‌ని, మాఫియాగా మారి గ్రూపు రాజ‌కీయాల‌ను న‌డిపిస్తార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. హిందీ చిత్ర‌సీమ‌లో డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ ఒక భాగం. దానిని విడిగా చూడ‌లేమ‌ని కూడా ప్ర‌చారం సాగింది.

అయితే బాలీవుడ్ పై ప్ర‌జ‌ల్లో అపోహ‌లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, సుశాంత్ సింగ్ కేసు త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌పై బుర‌ద ఎక్కువ‌గా జ‌ల్లార‌ని కూడా న‌టుడు స‌మీర్ సోని తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు. హిందీ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ విష‌యంలో చాలా అపోహలు ఉన్నాయని, ఇది ఒకే సంస్థ అని .. పరిశ్రమలోని వ్యక్తులు డ్రగ్స్ బానిసలని అన్యాయంగా ప్ర‌జ‌లు నమ్ముతార‌ని అన్నాడు.

బాలీవుడ్‌ను ఒకే సంస్థగా చూసే ధోరణి ఉందని, ప్రతి ఒక్కరూ అందరికీ కనెక్ట్ అయ్యే ఏకీకృత పరిశ్రమగా ప్రజలు భావిస్తారని అన్నారు. ప‌రిశ్ర‌మ‌ను రాజ‌కీయాల‌ ధృక్కోణంలో చూడాల‌ని కూడా వ్యాఖ్యానించారు. బాలీవుడ్ యూనిఫాం ఇండస్ట్రీ కాదని న‌టుడు స‌మీర్ సోని స్పష్టం చేశారు. నిర్మాతలు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించగల నటీనటులతో పని చేయాల‌నుకుంటారు.. ఇతర వ్యాపారాల మాదిరిగానే ఇది కూడా ర‌న్ అవుతుంద‌ని అన్నారు. బాలీవుడ్‌లో ఉమ్మడి ఆసక్తులను షేర్ చేసుకునే గ్రూపులు ఉన్నాయ‌ని.. అది ఒకే ఒక్క సంస్థ మాత్రమే కాకుండా విభిన్న వ్యక్తులతో రూపొందిన‌ది అని గుర్తించడం ముఖ్యం! అని విశ్లేషించారు. కొన్ని అపోహలను చాలా తీవ్రంగా తీసుకోవడం ఎదురుదెబ్బల‌కు దారితీస్తుందని సమీర్ పేర్కొన్నాడు.

ప్రత్యేకించి 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాదక‌ర‌ మరణం తర్వాత సంఘటనల గురించి స‌మీర్ సోని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. సుశాంత్ మరణం రాజకీయ దుమారానికి తెర లేపింది. ఆ సమయంలో హిందీ చిత్ర పరిశ్రమ మాదకద్రవ్యాల వినియోగదారుల అడ్డాగా మారింద‌ని అన్యాయంగా ముద్రవేసారు. బాలీవుడ్‌ను ప్రమాదకరమైన స్థ‌లంగా ప్ర‌చారం చేసార‌ని స‌మీర్ సోని ఆవేద‌న వ్య‌క్తం చేసాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు తర్వాత బాలీవుడ్ పై అవగాహన ఎలా మారిందో కూడా అతడు గుర్తు చేసుకున్నాడు, ఇక్కడ పరిశ్రమ మాదకద్రవ్యాల దుర‌ల‌వాటుతో నిండి ఉందని మీడియాలో చిత్రీకరించారు. కానీ అర్థం చేసుకోవాల్సిన‌వి చాలా ఉన్నాయి. ఇక్క‌డివారు వినోదభరితంగా లేదా రాజకీయంగా కనిపిస్తారు. కొంద‌రు విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉండవచ్చు.. అయితే పరిశ్రమలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా తమకు వ‌చ్చిన పేరు కారణంగా అతిగా క‌నిపిస్తారని ఆయన లోపాల‌ను ఎత్తి చూపారు.