Begin typing your search above and press return to search.

వీడియో: యంగ్ టైగ‌ర్ హీరోయిన్‌ని గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా?

ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, చిరంజీవి వంటి అగ్ర హీరోల‌ స‌ర‌స‌న న‌టించిన స‌మీరా రెడ్డి గురించే ఇదంతా.

By:  Tupaki Desk   |   8 March 2025 10:40 PM IST
వీడియో: యంగ్ టైగ‌ర్ హీరోయిన్‌ని గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా?
X

ఒక‌ప్పుడు కుర్ర‌కారు క‌ల‌ల రాణి.. కానీ ఇప్పుడు బామ్మ‌లా మారి అంద‌రికీ షాక్ ఇచ్చింది. 6 నుంచి 60 వ‌ర‌కూ ఏజ్‌తో సంబంధం లేకుండా కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చిన‌ ఆ బ్యూటీ ఈ ఏజ్డ్ విమేనా? అని ఆశ్చ‌ర్య‌పోయేలా ఆ రూపంలో వ‌చ్చిన ఈ తేడా చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, చిరంజీవి వంటి అగ్ర హీరోల‌ స‌ర‌స‌న న‌టించిన స‌మీరా రెడ్డి గురించే ఇదంతా.

అప్ప‌ట్లో స‌డెన్ గా పెళ్లాడి ఫ్రెగ్నెన్సీ అనుభ‌వాల‌ గురించి సోష‌ల్ మీడియాల్లో రెగ్యుల‌ర్ గా పోస్టులు పెట్టింది. త‌ల్లి అవ్వ‌డంలో ఉన్న మాధుర్యం గురించి, పోస్ట్ ఫ్రెగ్నెన్సీ బెల్లీ గురించి.. బిడ్డతో కునుకు లేని స్ట్ర‌గుల్స్ గురించి స‌మీరా రెడ్డి చాలా మాట్లాడింది. మ‌ళ్లీ కొంత గ్యాప్ త‌ర్వాత స‌మీరా ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. త‌ల్లి అయ్యేప్ప‌టికే పూర్తిగా షేప‌వుట్ అయిపోయి, త‌ల‌పండిన‌ రూపంతో షాకిచ్చిన స‌మీరా రెడ్డి ఇప్పుడు 90 కేజీల బ‌రువు.. పొట్ట చుట్టూ ట‌న్నుల కొద్దీ బెల్లీతో ఇంకా పెద్ద షాకిచ్చింది.

నిజానికి ఫ్రెగ్నెన్సీ త‌ర్వాత కూడా చాలా మంది క‌థానాయిక‌లు త‌మ రూపం మార‌కుండా చాలా శ్ర‌మిస్తున్నారు. జిమ్ములు, యోగా అంటూ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో తిరిగి త‌మ పాత రూపానికి మారుతున్నారు. కానీ స‌మీరా రెడ్డి పూర్తిగా దానికి భిన్నంగా క‌నిపిస్తోంది. త‌న‌కు థైరాయిడ్ ఇత‌ర ఆనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఇంత‌కుముందు చెప్పుకొచ్చిన స‌మీరా ఇప్పుడు పూర్తిగా షేపవుట్ అయిపోయి పొట్ట చుట్టూ బెల్లీతో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఇప్పుడు ఈ బ‌రువు త‌గ్గేందుకు సీరియ‌స్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నానని స‌మీరారెడ్డి చెబుతోంది.

తాజాగా ఇన్‌స్టాలో సమీరా తన వ్యాయామ షెడ్యూల్ ని ప్రదర్శించే రీల్‌ను పోస్ట్ చేసింది. జిమ్‌లో న‌డుము చుట్టూ పెరిగిన బెల్లీని, మారిన త‌న‌ కొలతలను చెక్ చేస్తూ క‌నిపించింది వీడియోలో. ఆ స‌మ‌యంలో స‌మీరా రూపం నిజంగా అభిమానుల‌కు షాకిచ్చింది.

90 కిలోల బ‌రువుతో 43-37.5-44 కొల‌త‌లు ఇవి అని చెప్పింది. ఆ తర్వాత జిమ్ లో సీరియ‌స్ గా క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియోను ప్ర‌ద‌ర్శించింది. నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు.. వ్యాయామంలో చాలా విష‌యాలు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని స‌మీరా చెప్పింది. పోష‌కాహారం, క‌స‌ర‌త్తుల విష‌యంలో అంకిత‌భావం ప్ర‌ద‌ర్శిస్తాన‌ని తిరిగి పాత రూపానికి మారేవ‌ర‌కూ పోరాటం ఆప‌న‌ని చెప్పింది. నేను ఈ సంవత్సరం చెత్తగా మారాన‌ని కూడా అంగీక‌రించింది. గత సంవత్సరం నేను ఎక్కడ, ఎప్పుడు వదులుకున్నానో నాకు తెలియదు! అని త‌న బ‌ద్ధ‌కం గురించి బ‌హిరంగంగా వెల్ల‌డించింది. 2025 ను ఒక సవాల్‌గా తీసుకున్నాన‌ని కూడా తెలిపింది. ధృఢ సంకల్పం ఉంది. పోషకాహారం, వెయిట్స్ శిక్షణ, యోగా, విశ్వాసంతో నేను తిరిగి రూపం మార్చుకుంటాన‌ని స‌మీరా చెబుతోంది. స‌మీరా రెడ్డి రూపం మార్చుకుని తిరిగి న‌ట‌న‌లోకి ప్ర‌వేశిస్తుందా? టాలీవుడ్ లో మ‌ళ్లీ ఛాన్సులిస్తారా? ఏమో కాల‌మే స‌మాధానం చెప్పాలి.