Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లోకి జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒకప్పటి హీరోయిన్ సమీరారెడ్డి కూడా పాల్గొనబోతుందంట. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా అశోక్ సినిమాలో నటించిన బ్యూటీ సమీరారెడ్డి.

By:  Tupaki Desk   |   11 Aug 2024 4:08 AM GMT
బిగ్ బాస్ లోకి జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్
X

ఒకప్పటి కథానాయకిలు కొందరు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మరల యాక్టివ్ అవుతున్న కూడా వారికి హీరోయిన్ గా ఉన్నప్పటి క్రేజ్ అయితే ఉండదని చెప్పొచ్చు. అయితే మరల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా బిజీ అవ్వాలని అనుకుంటున్న వారు మాత్రం ఏదో ఒక ప్లాట్ ఫామ్ ద్వారా లైమ్ లైట్ లోకి రావాలని అనుకుంటున్నారు.

అలాంటి వారికి బిగ్ బాస్ రియాలిటీ షో మంచి వేదికగా మారుతోంది. ఈ షో ద్వారా చాలా మంది ఫేమ్ సంపాదించుకున్నారు. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 8 మొదలు కాబోతోంది. ఇప్పటికే ఈ షో ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. కంటిస్టెంట్ ల ఎంపిక కూడా జరిగిపోయిందంట. అయితే హౌస్ లోకి వెళ్లేంత వరకు కంటిస్టెంట్ ల విషయంలో ఒక క్లారిటీ రాదు.

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒకప్పటి హీరోయిన్ సమీరారెడ్డి కూడా పాల్గొనబోతుందంట. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా అశోక్ సినిమాలో నటించిన బ్యూటీ సమీరారెడ్డి. అయితే ఆమె పాల్గొనేది తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కాదంట. మరో రెండు నెలల తర్వాత హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో మొదలు కాబోతోంది.

ఈ సీజన్ లో ఆమెని కంటిస్టెంట్ గా ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఆమె చాలా సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం సమీరారెడ్డి యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య రెగ్యులర్ గా అప్డేట్స్ పెడుతోంది. సమీరా రెడ్డికి ఇప్పటికే రెండు, మూడు సార్లు బిగ్ బాస్ లో ఎంట్రీ కోసం అవకాశం వచ్చిందంట.

అయితే ఏవో కారణాలతో ఆమె వెళ్ళడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కానీ ఇప్పుడు సమయం లభించడంతో బిగ్ బాస్ హిందీ రియాలిటీషోలో పాల్గొనబోతోందని సమాచారం. ఒకవేళ ఆమె ఎంట్రీ ఇస్తే మరల మునుపటి ఫేమ్ ని తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. బాలీవుడ్ లో వెటరన్ బ్యూటీస్ చాలా మంది ఇప్పటికి నటీమణులుగా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. సమీరారెడ్డి లుక్, బాడీ షేప్స్ మార్చుకుంటే మరల ఆమె కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కనీసం ఓటీటీ సిరీస్ లలో అయిన అవకాశం లభిస్తుందనే మాట వినిపిస్తోంది.