స్టన్నింగ్ సామ్... కిల్లర్ లుక్
సమంత స్ట్రాన్నింగ్ అనేలా ఉంది అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక లుక్స్ అయితే కిల్లింగ్ అంటూ కూడా క్యాప్షన్స్ ఇస్తున్నారు.
By: Tupaki Desk | 9 Oct 2023 8:06 AM GMTబ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఖుషి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి రావాలని అనుకుంది. కానీ ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం సమంత తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా అడుగులు వేస్తోంది. అక్కడే కొన్నాళ్లపాటు ట్రీట్మెంట్ తీసుకునే ప్రకృతి వాతావరణంలో మరింత ఎనర్జీటిక్ గా మారాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తన జీవితానికి సంబంధించిన కొటేషన్స్ కూడా ఆమె ఎక్కువగానే ఇస్తుంది. ఇక రీసెంట్గా సమంత పోస్ట్ చేసిన మరికొన్ని లుక్స్ వైరల్ గా మారుతున్నాయి. అందులో ఆమె ఎద అందాలను మరింత హైలెట్ చేస్తూ ఒక స్టైలిష్ డ్రెస్ లో దర్శనమిచ్చింది.
అందమైన హారాన్ని కూడా ధరించిన ఆమె తన లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. సమంత స్ట్రాన్నింగ్ అనేలా ఉంది అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక లుక్స్ అయితే కిల్లింగ్ అంటూ కూడా క్యాప్షన్స్ ఇస్తున్నారు. సమంత ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా వైరల్ అవుతాయని మరోసారి రుజువు చేసింది.
గతంలో ఇంతకంటే ఘాటైన ఫోటోలతో కూడా దర్శనం ఇచ్చిన ఆమె ఈసారి మాత్రం మరింత అందంగా ఉంది అంటూ ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక సమంత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను ఫినిష్ చేసుకోలేకపోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కింది.
ఇక ఆమె విదేశాల్లో కొన్ని రోజులు గడిపి మళ్లీ ఇండియాకు తిరిగి రానుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా ఆమె మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో సిటాడెల్ రీమేక్ చేస్తున్న ఆమె చెన్నై స్టోరీస్ అనే ఒక ఇంగ్లీష్ తమిళ్ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తోంది. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేసేందుకు సమంత ఆలోచిస్తున్నట్లు సమాచారం.