ఈ నటి పెళ్లి ముచ్చట వింటే సమ్మోహనం సినిమా గుర్తుకు రావాల్సిందే
దండుపాళ్యం మూవీలో బోల్డ్ క్యారెక్టర్ కు ప్రాణం పోసిన నటి పూజాగాంధీ. దండు పాళ్యం ఫ్రాంచైజ్ లో ఆమె క్యారెక్టర్ అందరిని షాక్ కు గురి చేస్తుంది.
By: Tupaki Desk | 28 Nov 2023 5:00 AM GMTఫీల్ గుడ్ మూవీ ‘సమ్మోహనం’ సినిమా గుర్తుందా? సుధీర్ బాబు హీరో గా నటించిన ఈ మూవీలో హీరోయిన్ ఒక ప్రముఖ నటి కావటం.. ఆమెకు ఒక సినిమాలో తెలుగు మీద మరింత పట్టు కోసం హీరో పాత్రధారి ఆమెకు తెలుగును నేర్పిస్తాడు. ఆ క్రమంలో అతడి గురించి ఆమెకు తెలీటం.. అనుకోకుండా అతడంటే ఇష్టం ఏర్పడటం కట్ చేస్తే.. ప్రేమ.. పెళ్లి తెలిసిందే. అచ్చం ఆ సినిమాలో మాదిరే తాజాగా రియల్ లైఫ్ లో తనకు భాషను నేర్పించిన వ్యక్తిని మనువాడటానికి ప్రముఖ నటి సిద్ధమైన వైనం ఆసక్తికరంగా మారింది.
దండుపాళ్యం మూవీలో బోల్డ్ క్యారెక్టర్ కు ప్రాణం పోసిన నటి పూజాగాంధీ. దండు పాళ్యం ఫ్రాంచైజ్ లో ఆమె క్యారెక్టర్ అందరిని షాక్ కు గురి చేస్తుంది. బెంగాలీ అయిన ఈ నటి తాజాగా కన్నడిగుడ్ని పెళ్లాడనుందన్న వార్తలు తాజాగా వస్తున్నాయి. త్వరలోనే వీరి వివాహం జరుగుతుందని చెబుతున్నారు. సమ్మోహనం సినిమాలో హీరోయిన్ మాదిరే.. ఆమె కన్నడ పరిశ్రమకు వచ్చిన మొదట్లో కన్నడను మాట్లాడేందుకు ఒకరుసాయం చేశారు. తాజాగా ఆ వ్యక్తినే ఆమె పెళ్లాడనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం నలభైల్లో ఉన్న ఆమెకు గతంలో వివాహాలు జరిగినా.. వైవాహిక జీవితానికి దూరంగా ఉంటున్నారు. 2001 నుంచి కన్నడ ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. తాజాగా మరోసారి పెళ్లిపీటల మీదకు ఎక్కనున్నట్లు చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన ఒక లాజిస్టిక్స్ కంపెనీ యజమాని అయిన విజయ్అనే వ్యక్తిని ఆమె పెళ్లాడబోతున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె పెళ్లి బుధవారం (నవంబరు 29)న జరగనున్నట్లు తెలుస్తోంది.
తన పెళ్లికి సంబంధించి ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. శాండల్ వుడ్ ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె పెళ్లి పనులు జోరుగా సాగుతున్నట్లుగా చెబుతున్నారు. కన్నడ భాష మీద పట్టు రావటం వెనుక విజయ్ సాయం ఉందట. ఆ పరిచయం కాలక్రమంలో ప్రేమగా మారిందని.. తాజాగా పెళ్లి పీటల వరకు వచ్చినట్లుగా చెబుతున్నారు. కన్నడ భాషను నేర్చుకోవటంలో విజయ్ చేసిన సాయం ఆమెను శాండల్ వుడ్ లో నిలదొక్కుకునేందుకు సాయం చేసినట్లుగా చెబుతారు. గతంలో ఒక ఎంగేజ్ మెంట్ జరిగి క్యాన్సిల్ కావటం.. తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ ను పెళ్లాడి విడిపోయినట్లుగా చెబుతారు.