Begin typing your search above and press return to search.

'సౌంద‌ర్య సాధ‌నాల‌'తోనే మ‌యోసైటిస్?

తాజాగా అల్కేష్ తో హెల్త్ పాడ్ కాస్ట్ లో మ‌యోసైటిస్ రాక‌కు కార‌ణ‌మేమిటో స‌మంత విశ్లేషించారు. సమంత అల్కేస్ అడిగిన‌ ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 5:30 AM GMT
సౌంద‌ర్య సాధ‌నాల‌తోనే మ‌యోసైటిస్?
X

అందాల స‌మంత గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ మ‌యోసైటిస్ తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికోసం విదేశాల్లో చికిత్స పొందుతోంది. ఖ‌రీదైన మెడిసిన్ ఉప‌యోగిస్తోంది. మంచి ఆహార విధానం, యోగా, మెడిటేష‌న్ తో త‌న ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. అయినా కానీ మ‌యోసైటిస్ అనే రుగ్మ‌త ఎంతో ఇబ్బందిక‌ర‌మైన‌ది. అలాంటి స‌మ‌స్య‌ను కూడా మొక్క‌వోని ధీక్ష‌తో ఎదుర్కొని అంద‌రిలో స్ఫూర్తి నింపింది సామ్.

తాజాగా అల్కేష్ తో హెల్త్ పాడ్ కాస్ట్ లో మ‌యోసైటిస్ రాక‌కు కార‌ణ‌మేమిటో స‌మంత విశ్లేషించారు. సమంత అల్కేస్ అడిగిన‌ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విష‌ప‌దార్థాల స్వీకారం.. వాటిని బ‌య‌టికి పంప‌డం మ‌ధ్య స‌మ‌తుల్య‌త లేన‌ప్పుడు ఆటో ఇమ్యూనిటీ పరిస్థితి ఏర్పడుతుందని అల్కేష్ పేర్కొన్నాడు. అదే సమయంలో సమంతా తన మంచి జీవనశైలి, వ్యాయామాలు, మంచి ఆహారం స‌హా ఇతర మంచి అలవాట్లన్నీ ఆరోగ్య సమస్యలకు ఎప్పటికీ కారణం కాదని నమ్ముతున్నందున తాను అపరాధ భావనకు గురయ్యానని పేర్కొంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నప్పటికీ విపరీతమైన పని ఒత్తిడి ..సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆటో ఇమ్యూన్ ఏర్పడుతుందని స‌మంత తెలిపింది.

శ్వాసించే గాలి, నీరు.. సౌందర్య సాధనాల వరకు ప్ర‌తిదీ ఆటో ఇమ్యూన్ కండిషన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయడం ప్రారంభిస్తుందని అన్నారు. అయితే 'సౌందర్య సాధనాలు' అనే పదాన్ని నొక్కిచెప్పినప్పుడు సమంత అసౌక‌ర్యంగా న‌వ్వ‌డం క‌నిపించింది. మ‌యోసైటిస్ స‌వాళ్లు, ఎదుర్కొనే విధానం గురించి స‌మంత మునుముందు ఎపిసోడ్స్ లో వెల్ల‌డించ‌నున్నారు.