Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ తమన్నా సెంటిమెంట్ కొనసాగిస్తాడా..?

ఇక ఓదెల 2 కి మళ్లీ తమన్నాని తీసుకొచ్చారు. రెండు దశాబ్దాల కెరీర్ లో తమన్నా ఇలా పూర్తిగా పాత్రలో ట్రాన్స్ ఫర్మ్ అయ్యి చేసిన సినిమాలు చాలా తక్కువ.

By:  Tupaki Desk   |   16 April 2025 3:00 AM
ఆ డైరెక్టర్ తమన్నా సెంటిమెంట్ కొనసాగిస్తాడా..?
X

సినిమా వాళ్ల సెంటిమెంట్స్ లో భాగంగా ఫలానా డైరెక్టర్ తన ప్రతి సినిమాలో ఆ హీరోయిన్ ని తీసుకుంటాడు తెలుసా అన్న విధంగ వార్తలు వచ్చేలా చేస్తాయి. ఇది ఆ దర్శకులు సెంటిమెంట్ లేదా ఆ హీరోయిన్ లక్కీ ఛార్మ్ గా భావిస్తారు కాబట్టే కొనసాగిస్తారు. హీరో, హీరోయిన్ కాంబినేషన్, డైరెక్టర్ హీరో కాంబినేషన్ ఎలానో.. డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్స్ కూడా కొన్నిసార్లు వర్క్ అవుట్ అవుతుంది. ఐతే ఇలాంటి కాంబినేషన్స్ చాలా అరుదుగా ఏర్పడతాయి.

ప్రస్తుతం ఈ సెంటిమెంట్ తో సినిమాలు చేస్తున్న దర్శకుల లిస్ట్ లో సంపత్ నంది ఉంటారు. ఆయన మొదటి సినిమా ఏమైంది ఈవేళ వదిలిపెడితే తర్వాత చేసిన రచ్చ నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఓదెల 1 లో సంపత్ నంది తమన్నాని మిస్ చేశాడు. అఫ్కోర్స్ అది ఆయన డైరెక్షన్ చేయలేదు కానీ అన్నీ ఆయనే దగ్గర ఉండి ఆ సినిమాకు చూశారు.

ఇక ఓదెల 2 కి మళ్లీ తమన్నాని తీసుకొచ్చారు. రెండు దశాబ్దాల కెరీర్ లో తమన్నా ఇలా పూర్తిగా పాత్రలో ట్రాన్స్ ఫర్మ్ అయ్యి చేసిన సినిమాలు చాలా తక్కువ. నాగ సాధువుగా తమన్నా తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది. తమన్నా లేకపోతే సంపత్ నంది సినిమాలు చేయడేమో అన్న రేంజ్ లో వీళ్ల కాంబినేషన్ గురించి మాట్లాడుకున్నారు. ఐతే ఓదెల 2 కన్నా ముందే సంపత్ నంది సాయి ధరం తేజ్ తో గాంజా శంకర్ చేయాల్సింది కానీ అది మధ్యలో ఆగిపోయింది.

ఐతే గాంజా శంకర్ మిస్సైనా మరో సినిమా లైన్లో పెట్టాడు సంపత్ నంది. యువ హీరో శర్వానంద్ తో సంపత్ నంది సినిమా రాబోతుంది. ఈ సినిమా 1965 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. ఐతే సంపత్ నంది సెంటిమెంట్ ప్రకారం శర్వా సినిమాలో కూడా తమన్నాని రిపీట్ చేస్తాడా అన్నది చర్చల్లో ఉంది. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శర్వానంద్ గెస్ట్ గా వచ్చి తమన్నాతో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. మరి శర్వాతో చేసే సినిమాకు సంపత్ మళ్లీ తమన్నా సెంటిమెంట్ రిపీట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.

తమన్నా కూడా వచ్చిన ప్రతి ఛాన్స్ కాదనకుండా చేస్తుంది. శర్వానంద్ సంపత్ నంది సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ లేకపోయినా తమన్నా కనీసం స్పెషల్ సాంగ్ కోసం అయినా ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.