Begin typing your search above and press return to search.

మాస్ డైరెక్టర్ తో శర్వా.. విచిత్రమైన కాంబో!

ప్రస్తుతం మనమే మూవీతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. సరికొత్త కథతో రాబోతున్న మనమే మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు

By:  Tupaki Desk   |   2 Jun 2024 6:39 AM GMT
మాస్ డైరెక్టర్ తో శర్వా.. విచిత్రమైన కాంబో!
X

టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్.. ఫీల్ గుడ్ జాన‌ర్ సినిమాల‌ను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. చివరగా ఒకే ఒక జీవితం మూవీతో వచ్చి ఆయన.. చిన్న గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు వరుస చిత్రాలతో సందడి చేయనున్నారు. ప్రస్తుతం మనమే మూవీతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. సరికొత్త కథతో రాబోతున్న మనమే మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల రిలీజైన మనమే ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాలోని మెజారిటీ సీన్స్.. లండన్ లో షూట్ చేయడంతో ట్రైలర్ ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో మూవీ టీమ్ మంచి హిట్ కొట్టాలని చూస్తోంది. అయితే శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. విచిత్రమైన కాంబినేషన్ లో శర్వానంద్ అప్ కమింగ్ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

పక్కా మాస్ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ సంపత్ నందితో కలిసి శర్వానంద్ వర్క్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రచ్చ , బెంగాల్ టైగర్, సీటీ మార్ అలా అనేక మాస్ సినిమాలు తెరకెక్కించిన సంపత్.. ఇప్పుడు శర్వాతో కూడా అదే జోనర్ లో ఓ మూవీ చేయనున్నారట. ఇప్పటికే రెడీ చేసి ఉంచిన మంచి మాస్ సబ్జెక్ట్ తో తెరకెక్కించనున్నారని టాక్ నడుస్తోంది. శర్వా.. సంపత్ నంది చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

అయితే సంపత్ నంది.. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తో గంజా శంకర్ మూవీ చేయాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిత్రం రూపొందేందుకు అంతా సిద్ధమైంది. కానీ కొన్ని కారణాల ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సాయి దుర్గ తేజ్.. ఆ సినిమాను వదిలేసి కొత్త డైరెక్టర్ తో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో సంపత్ నంది.. శర్వానంద్ తో కాంబో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక శర్వా, సంపత్ నందిది విచిత్రమైన కాంబినేషన్ అని చెప్పాలి. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ప్రేమ కథలు వంటి ఫీల్ గుడ్ చిత్రాలు చేసిన హీరో.. పక్కా మాస్ సినిమాలు తీసే డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నారు. ఇప్పుడు సంపత్ నంది.. శర్వానంద్ కోసం ఎలాంటి స్టోరీ రెడీ చేశారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. మనమే మూవీ రిలీజ్ తర్వాత అన్ని వివరాలు అనౌన్స్ చేయనున్నారని టాక్. మరి చూడాలి ఎప్పుడు ప్రకటిస్తారో.