వాళ్ళు చేస్తే ప్రమోషన్స్.. మనవాళ్ళు చేస్తే ఇలానా?
అయితే, ఇదే షోని బాలీవుడ్ వాళ్లు చేసి ఉంటే ఆహా, ఓహో అంటూ మెచ్చుకునేవారు. ప్రమోషన్స్ బాగా చేశారు అని మెచ్చుకునేవారు.
By: Tupaki Desk | 17 Aug 2023 4:30 PM GMTవిజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషీ. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయగా, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి సమంత రాలేకపోయింది. దీంతో, స్పెషల్ ఈ మూవీ టీమ్ మ్యూజిక్ కన్సర్ట్ చేశారు. ఈ మూవీలోని పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో, స్పెషల్ గా మ్యూజిక్ కన్సర్ట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. సమంత కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంది.
అయితే, ఈ ఈవెంట్ మొత్తాన్ని విజయ్, సమంతలు దగ్గరుండి చూసుకున్నారు. వారిద్దరే హైలెట్ అని చెప్పాలి. నిజానికి మ్యూజిక్ కన్సర్ట్ అంటే, ఆ మూవీలోని పాటలను సింగర్స్ తో పాడించడం, డ్యాన్సులు చేయించడం చేస్తారు. అయితే, దీనిలో కూడా అదే చేశారు. కానీ, సమంత, విజయ్ లు స్పెషల్ గా డ్యాన్సులు వేశారు. లైవ్ లో చూసిన వారికి మంచి ఐఫీస్ట్ లాగా మారింది అని చెప్పాలి.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అది మూవీ ఈవెంటా లేక, మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూటా అంటూ విపరీతంగా విమర్శించారు. అయితే, ఇదే షోని బాలీవుడ్ వాళ్లు చేసి ఉంటే ఆహా, ఓహో అంటూ మెచ్చుకునేవారు. ప్రమోషన్స్ బాగా చేశారు అని మెచ్చుకునేవారు. కానీ, మన దగ్గర మొదటిసారి ఇలా చేయడంతో, విమర్శిస్తున్నారు.
ఇదో కొత్త రకం ప్రమోషనల్ స్టంట్ అని ఎందుకు అనుకోకూడదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి అక్కడ వారిద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్స్ వేశారు. అంతే కానీ, ఓవర్ గా రొమాన్స్ చేసి, ఇబ్బంది కలిగించేలా చేసింది ఏమీ లేదు. తమ సినిమాలోని పాత్రలను అక్కడ పోషించారు.
దానికే అంత విమర్శించాల్సిన అవసరం లేదు అని సమంత, విజయ్ ఫ్యాన్స్ అభిప్రాయం. ఇక, ఈ మూవీ కంప్లీట్ లవ్ స్టోరీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు