Begin typing your search above and press return to search.

సంయుక్త.. నెంబర్ వన్ లైనప్

ఇలా ఓవరాల్ గా 6 సినిమాల వరకు ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం.

By:  Tupaki Desk   |   13 Sep 2024 7:30 AM GMT
సంయుక్త.. నెంబర్ వన్ లైనప్
X

సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అంటే మలయాళీ హీరోయిన్స్ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అక్కడి భామలు ఏ సినిమా చేసిన కచ్చితంగా అందులో తమదైన ముద్ర వేసుకుంటారు. తమ నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో సౌత్ లో బాగా వినిపిస్తోన్న మలయాళీ బ్యూటీ పేరు సంయుక్త మీనన్. ఈ బ్యూటీ పాప్ కార్న్ అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది.

తరువాత వరుసగా మలయాళీలో సూపర్ హిట్స్ అందుకొని హైయెస్ట్ పెయిడ్ మలయాళీ హీరోయిన్ గా మారింది. భీమ్లా నాయక్ సినిమాతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయిన తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత బింబిసారాతో సూపర్ హిట్ అందుకుంది. విరూపాక్ష సినిమాలో హీరోయిన్ గా నటించిన సంయుక్త విభిన్నమైన పాత్రలో అందరిని మెస్మరైజ్ చేసింది.

ఆమె పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో సంయుక్త మీనన్ నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అనంతరం తెలుగులో సంయుక్త పైన ఆడియన్స్ ఫోకస్ తగ్గింది. అయిన నటిగా సంయుక్త జోరు మాత్రం తగ్గలేదని ఆమె సినిమాల లైన్ అప్ చూస్తుంటే తెలుస్తోంది. నిఖిల్ స్వయంభు సినిమాలో సంయుక్త మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది.

ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇందులో వారియర్ క్వీన్ తరహాలో ఆమె క్యారెక్టర్ ఉంది. అలాగే శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మొదలైన సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మూవీలో ఆమె క్లాసికల్ డాన్సర్ గా కనిపిస్తోంది. అలాగే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 12వ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఇలా తెలుగులో మూడు సినిమాలతో పాటు హిందీల మహారాగ్ని అనే చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తోంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మలయాళీ చిత్రం రామ్ లో కూడా సంయుక్త మీనన్ కీలక పాత్ర చేస్తోంది. తమిళంలో కూడా ఓ సినిమాలో సంయుక్త మీనన్ కన్ఫర్మ్ అయ్యిందంట. ఇలా ఓవరాల్ గా 6 సినిమాల వరకు ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం. ఈ లైన్ అప్ చూస్తుంటే నెక్స్ట్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరడానికి కావాల్సినంత స్కోప్ సంయుక్త మీనన్ కి ఉందనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది.