పోలీస్ రాక్షసి.. ఈసారి క్లిక్కయ్యేనా?
మొదటి నుంచి కూడా ఆమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ హిట్టవుతున్నాయి.
By: Tupaki Desk | 17 Dec 2024 4:21 PM GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అందం ప్లస్ అదృష్టం కలిగిన హీరోయిన్స్ లలో సంయుక్త మీనన్ టాప్ లో ఉందని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా ఆమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ హిట్టవుతున్నాయి. ఇక 2023లో సార్ - విరుపాక్ష సినిమాలతో బిగ్ హిట్స్ అందుకున్న ఆమె, ఓ మోస్తరు విజయం సాధించిన డెవిల్ తర్వాత మరింత బిజీగా మారింది.
ప్రస్తుతం సంయుక్త చేతిలో అర డజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఈ లైనప్ లో హీరోయిన్లకు ప్రత్యేకంగా అనిపించే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఒకే చేసి ప్రేక్షకుల్ని మరోసారి ఆశ్చర్యపరిచింది. సంయుక్త మీనన్ నటించనున్న ఈ లేటెస్ట్ మూవీకి ‘రాక్షసి’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ పాత్ర కోసం ఆమె మేకోవర్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలతో పోలిస్తే ఈ రోల్ చాలా వయోలెంట్‌గా, టఫ్‌గా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుందనే నమ్మకంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.
ఈ సినిమాను రాజేష్ దండా నిర్మిస్తుండగా, యోగి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల కోసం తెలుగులో చాలా తక్కువమంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. కానీ ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. ఈ విషయంలో సంయుక్త ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పొచ్చు.
‘రాక్షసి’ అనే టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ, టైటిల్ నెగటివ్‌గా అనిపించవచ్చనే సందేహం మేకర్స్‌కు ఉంది. సినిమా కథ పాత్రల తాలూకు జానర్‌ను మరింత అర్థమయ్యేలా మంచి టైటిల్ ఏదైనా దొరికితే ‘రాక్షసి’ టైటిల్‌ను పక్కన పెట్టే అవకాశముందని కూడా మరొక టాక్ వినిపిస్తోంది. లేదంటే ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. టైటిల్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతుండటంతో ప్రేక్షకుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది.
ఇప్పటి వరకు లక్కీ హీరోయిన్ ట్యాగ్‌తో సంయుక్త ఓ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా పూర్తిగా ఆమె భుజాల మీదే ఉండటంతో మరో రేంజ్ విజయాన్ని అందుకునే అవకాశముంది. ‘రాక్షసి’ టైటిల్ ఎంతవరకు క్లిక్ అవుతుందో తెలియదుగానీ, సంయుక్త పవర్‌ఫుల్ పాత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించే అవకాశం ఉంది. మరి ఈసారి అమ్మడి లక్కు ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.