అఖండ 2 కోసం మరో టాలెంటెడ్ బ్యూటీ.. వ్వాటే కాంబో!
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ లో హై వోల్టేజ్ మాస్ వైబ్ క్రియేట్ అవుతుంది .
By: Tupaki Desk | 24 Jan 2025 9:14 AM GMTనందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ లో హై వోల్టేజ్ మాస్ వైబ్ క్రియేట్ అవుతుంది . ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు నాలుగోసారి కలిసి భారీ అంచనాలతో అఖండ 2 చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు, బాలయ్యకు కొత్త హిట్స్ జోరును తెచ్చిన సినిమాగా చరిత్రకెక్కింది. ఇప్పుడు రెండో భాగం మునుపెన్నడూ లేని స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి రోజు నుంచే బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో చిత్రీకరణను ప్రారంభించడం గమనార్హం. బాలయ్య బోయపాటి కాంబినేషన్‌లో నాల్గవ చిత్రం కావడంతో, ఈసారి సినిమా ప్రతి విషయంలోనూ గ్రాండ్ గా ఉండబోతోందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. అఖండ సీక్వెల్‌తో సృష్టించబోయే మేజిక్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ లోకి వెళితే, అందాల భామ సమ్యుక్త కీలక పాత్రలో కనిపించబోతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తెలుగులో భీమ్లా నాయక్, విరూపాక్ష వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన సమ్యుక్త, ఇప్పుడు బాలయ్య సరసన కీలక పాత్రలో మెరవనుంది. సినిమా కథకు ఆమె పాత్ర చాలా కీలకమైందని, ఈ పాత్ర సమ్యుక్త కెరీర్‌లో బెస్ట్ గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే ఇటీవల కాలంలో ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఇక ఆల్ రెడీ సాలీడ్ క్రేజ్ ఉన్న అఖండ 2లో ఆమె నటిస్తుండడంతో ఈసారి ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. అఖండ 2 చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రం కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. థమన్ తన మ్యూజిక్‌తో సినిమాలోని హై వోల్టేజ్ సీన్స్ మరో లెవెల్ లో హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రామ్ ఆచంట గోపి ఆచంట ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలయ్య అభిమానులకు ఇది నిజంగా పండుగ అవుతుంది. ఈసారి బాలయ్య మాస్ మార్క్‌ను ఇంకాస్త పై స్థాయికి తీసుకెళతారని, బోయపాటి స్టైల్ మేకింగ్ మరోసారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని ఆశలు పెట్టుకున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.