Begin typing your search above and press return to search.

పుష్ప 2 కోసం వెళ్తే.. ఆమెను భయపెట్టించారట..!

ఐతే పుష్ప 2 సినిమా ఆ ఇద్దరి కెరీర్ కి చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 5:30 AM GMT
పుష్ప 2 కోసం వెళ్తే.. ఆమెను భయపెట్టించారట..!
X

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఎలాంటి సినిమా వచ్చినా అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఆ విషయాన్ని పుష్ప 1 ప్రూవ్ చేయగా పుష్ప 2 దాన్ని మించి సక్సెస్ అందుకుని ఆ కలయికకు ఉన్న స్పెషాలిటీ ఏంటో మరింత ప్రూవ్ చేసింది. ఐతే పుష్ప 2 సినిమా ఆ ఇద్దరి కెరీర్ కి చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా తెలుగు సినిమా పాన్ ఇండియా వైడ్ హిట్ అవ్వాలంటే అది కేవలం రాజమౌళి వల్లే అవుతుందని అనుకున్నారు కానీ ఆ లైన్ లోనే తాను ఉన్నానని ప్రూవ్ చేశాడు డైరెక్టర్ సుకుమార్.

ఇక నటుడిగా అల్లు అర్జున్ కూడా కేవలం రాజమౌళి సినిమాతోనే 1000 కోట్ల వసూళ్లు, పాన్ ఇండియా క్రేజ్ తెస్తారన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. ఈ ఇద్దరు పుష్ప 2 కోసం తీసుకున్న 3 ఏళ్ల టైం కు ఆడియన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దానికి మించి అవుట్ పుట్ ఇచ్చారు. అందుకే సినిమా ఈ రేంజ్ సక్సెస్ తో దూసుకెళ్తుంది. పుష్ప 2 సినిమా చూసిన ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. రెండో వారంలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది.

ఐతే పుష్ప 2 లో మేజర్ హైలెట్ గా చెప్పుకునే జాతర సీన్ అందరికీ ఫేవరెట్. ఐతే అది కొందరికి పూనకాలు తెప్పించేస్తుంది. ఒంటి మీదకు అమ్మవారు వస్తే ఎలా అయితే ఊగిపోతారో పుష్ప 2 చూసిన కొందరు అలానే పూనకాలతో ఊగిపోతున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు. ఐతే ఇలానే తనకు జరిగిన ఒక వింత అనుభవం గురించి యువ నటి సంయుక్త షణ్ముఖనాథన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పుష్ప 2 చూసిన తనకు జాతర సీన్ రాగానే తన పక్కన కూర్చున్న మహిళకు పూనకాలు వచ్చాయని.. ఆమె ఊగిపోతూ సామీ అని గట్టిగా అరిచిందని రాసుకొచ్చింది. ఆ పక్కన ఆమె భర్త ఆమెను శాంతింపచేయాలని చూశారు. తాను భయపడి 10 రూపాయల టికెట్ లో వెళ్లి కూర్చున్నా అని పెట్టింది. ఐతే భయపడటం వరకు ఓకేలే కానీ ఇంకా ఇప్పటికీ నేల టికెట్ 10 రూపాయలే ఉన్నాయా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కేవలం సంయుక్త మాత్రమే కాదు పుష్ప 2 చూస్తున్న చాలామందికి ఇలాంటి ఒక ఎక్స్ పీరియన్స్ అవుతుంది. పుష్ప 2 సినిమా జనాల్లో ఎంత ప్రభావం చూపిస్తుంది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. నార్త్ లో ఈ సినిమాకు ఇంకా కాన్ స్టంట్ వసూళ్లు వస్తున్నాయి. ఫైనల్ రన్ లో పుష్ప 2000 కోట్లు టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.