Begin typing your search above and press return to search.

రేసింగుకి స్వ‌యంభు బ్యూటీ రెడీ

ఈ బ్యూటీకి 2022లో విడుదలైన 'భీమ్లా నాయక్' మొదటి సినిమాగా రిలీజయింది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 3:00 AM GMT
రేసింగుకి స్వ‌యంభు బ్యూటీ రెడీ
X

సంయుక్త మీనన్ 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళం సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టి, 2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమై, కళ్యాణ్ రామ్ నటించిన `బింబిసార`తో టాలీవుడ్‌లో ప్ర‌వేశించాల‌నుకున్నా, ఈ బ్యూటీకి 2022లో విడుదలైన 'భీమ్లా నాయక్' మొదటి సినిమాగా రిలీజయింది. ఆమె 2022లో గాలిపట 2 తో కన్నడ సినీ రంగంలోకి పరిచయమైంది.


ప్ర‌స్తుతం ట్యాలెంటెడ్ స్టార్ నిఖిల్ స‌ర‌స‌న‌ 'స్వయంభు'లో న‌టిస్తోంది సంయుక్త మీన‌న్. ఇంత‌కుముందు జాతీయ అవార్డ్ గ్ర‌హీత ధనుష్ తో కలిసి సర్ (వాతి) లో.. క‌ళ్యాణ్ రామ్ తో బింబిసార .. సాయిధరమ్ తేజ్ తో విరూపాక్ష లో న‌టించింది. ఇవ‌న్నీ విజ‌యాలు సాధించ‌డ‌మే గాక న‌టిగా మంచి పేరు తెచ్చాయి. సంయుక్త ఇప్ప‌టికే టాలీవుడ్ లో పాపుల‌ర్ హీరోయిన్.

ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ ఉంది. అందానికి అందం ప్ర‌తిభ‌తో త‌న రేంజును పెంచుకున్న సంయుక్త ఫిట్‌నెస్ ఫ్రీక్ గా హృద‌యాల‌ను కొల్ల‌గొడుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తోంది. త‌దుపరి స్వ‌యంభు విడుద‌ల కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. బాలీవుడ్ లో మ‌హారాణి- క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే చిత్రంలో సంయుక్త న‌టిస్తోంది. అలాగే మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ రామ్ అనే మ‌ల‌యాళ‌ చిత్రంలోను న‌టిస్తోంది.

మ‌రోవైపు సంయుక్త సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్న ఫోటోగ్రాఫ్స్- వీడియోల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఒక రేసు గుర్రంతో స‌న్నిహితంగా సంయుక్త ఇచ్చిన‌ ఫోజ్ ఇంట‌ర్నెట్ లో అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. తెలుగు న‌లుపు చాల‌ర చొక్కా తొడుక్కుని, బ్లాక్ స్పోర్ట్ ఇన్న‌ర్ లో క‌నిపించిన సంయుక్త‌, త‌ల‌కు హెల్మెట్ ని ధ‌రించి రేస‌ర్ లా మారిపోయింది. ఈ ఫోటోగ్రాఫ్ త‌న‌లోని గ‌ట్స్‌ని ఎలివేట్ చేసింద‌ని చెప్పాలి.

సంయుక్త మీనన్ 1995 సెప్టెంబరు 11న కేరళ రాష్ట్రం, పాలక్కడ్‌లో జన్మించింది. చిన్మయ విద్యాలయలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి.. త్రిసూర్‌లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది.