Begin typing your search above and press return to search.

శారీ లుక్‌: ఏ మాయ చేసావే సంయుక్తా..!

ఈ మ‌ల‌యాళీ బ్యూటీ ఇప్ప‌టికే తెలుగు చిత్ర‌సీమ‌లో చెర‌గ‌ని ముద్ర వేసింది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 4:57 PM GMT
శారీ లుక్‌: ఏ మాయ చేసావే సంయుక్తా..!
X

సంయుక్త మీనన్ ఫ్యాషన్ ప్రపంచంలో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. సాంప్రదాయక వస్త్రధారణ అయినా, నేటి జెన్ జెడ్ త‌ర‌హాలో అల్ట్రా మోడ్ర‌న్ లుక్ అయినా సంయుక్త అంద‌చందాలు ఒక క‌వ్వింపు. న‌టిగా, స్టైల్ ఐకాన్‌గా తన బహుముఖ ప్రజ్ఞతో ఆక‌ట్టుకుంటోంది.


ఈ మ‌ల‌యాళీ బ్యూటీ ఇప్ప‌టికే తెలుగు చిత్ర‌సీమ‌లో చెర‌గ‌ని ముద్ర వేసింది. విల‌క్ష‌ణ‌ క‌ళాకారిణిగా త‌న‌దైన న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌తో భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో ఫోటోషూట్ల‌తోను అభిమానుల‌కు చేరువ‌వుతోంది. తాజాగా సంయుక్త షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. ఈ బ్యూటీ తెలుగింటి సీత‌లా చీర‌లో అందంగా క‌నిపించింది. ఎరుపు వంగ‌పువ్వు రంగు మిశ్ర‌మంతో రూపొందించిన ఈ డిజైన‌ర్ శారీ జ‌రీ అంచుతో త‌ళ‌త‌ళ‌లాడుతోంది. ఇక కాంబినేష‌న్ బ్లౌజ్ మోడ్ర‌న్ అప్పీల్ తో మైమ‌రిపిస్తోంది.


ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వేగంగా దూసుకెళుతోంది. సంయుక్త చీర‌లో ఎంతో అందంగా క‌నిపిస్తోంద‌ని, తెలుగింటి సాంప్ర‌దాయం ఉట్టిప‌డుతోంద‌ని నెటిజ‌నులు ప్ర‌శంసిస్తున్నారు. ఆ క‌ళ్ల‌లో మెరుపు.. నాటీ హొయ‌లు మ‌తి చెడగొడుతున్నాయి! అంటూ యూత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఓవరాల్ గా సంయుక్త శారీ లుక్ తో స్ట‌న్న‌ర్ గా మారింది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సంయుక్త ఇటీవల `డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్` చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వనప్పటికీ, తన నటనా నైపుణ్యంతో మైమ‌రిపించింది. టాలీవుడ్ లో ప్రతిభావంతులైన నిఖిల్, శర్వానంద్, రానా వంటి స్టార్ల‌తో ప్ర‌స్తుతం సినిమాలు చేస్తోంది. నిఖిల్ స‌ర‌స‌న స్వ‌యంభు అనే చిత్రంలో సంయుక్త న‌టిస్తోంది. మ‌రోవైపు మలయాళం, హిందీ చిత్రాలలోను సంయుక్త న‌టిస్తోంది. కానీ త‌న‌కు మంచి అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తున్న తెలుగు చిత్ర‌సీమ‌కు తొలి ప్రాధాన్య‌త‌నిస్తోంది.