Begin typing your search above and press return to search.

ఆ అలవాటుంద‌న్న సంయుక్త

తాజాగా సంయుక్త ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Feb 2025 6:30 PM GMT
ఆ అలవాటుంద‌న్న సంయుక్త
X

టాలీవుడ్ ఆడియ‌న్స్ కు సంయుక్తా మీన‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలుగుతో పాటూ త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాతో కూడా సౌత్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త భీమ్లా నాయ‌క్ సినిమాతో అంద‌రి దృష్టిని అల‌రించింది. సాగర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు ఆడియ‌న్స్ కు ప‌రిచ‌య‌మైన ఈ భామ ప్రేక్ష‌కుల గుండెల్లో చోటు ద‌క్కించుకుంది.

విరూపాక్ష సినిమాలో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డంతో పాటూ మంచి న‌టిగా కూడా పేరు తెచ్చుకుంది సంయుక్త‌. అమ్మ‌డు ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోల‌ను, అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. సంయుక్తకి సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది.

తాజాగా సంయుక్త ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. సంయుక్త త‌న లైఫ్ స్టైల్ గురించి చెప్పే క్ర‌మంలో కొన్ని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. త‌న‌కు ఆల్క‌హాల్ సేవించే అల‌వాటుంద‌ని, కానీ అదే ప‌నిగా తాగ‌న‌ని, ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువైన‌ప్పుడు మాత్ర‌మే కొంచెం తీసుకుంటాన‌ని ఎలాంటి మొహ‌మాటాలు లేకుండా చెప్పింది.

మామూలుగా హీరోయిన్ల‌కు ఇలాంటి అల‌వాట్లున్నా ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ సంయుక్త మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ముక్కు సూటిగా చెప్పేసింది. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పి త‌న ఫ్యాన్స్ ను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంయుక్త కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విష‌యానికొస్తే భీమ్లా నాయ‌క్ మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సంయుక్త మీన‌న్ ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న బింబిసార‌లో న‌టించింది. త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న విరూపాక్ష సినిమా చేసి హ్యాట్రిక్ హిట్లు అందుకుంది. త‌మిళంలో ధ‌నుష్ స‌ర‌స‌న చేసిన సార్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డంతో అమ్మ‌డు స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం బింబిసార‌2, స్వ‌యంభు, అఖండ‌2 సినిమాల‌తో బిజీగా ఉంది సంయుక్త మీన‌న్.