గ్యాప్ ఎక్కువైతే డేంజరే అమ్మడు..!
లాస్ట్ ఇయర్ లవ్ మీ సినిమాలో కెమియో రోల్ చేసిన సం యుక్త ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు సినిమా చేస్తుంది.
By: Tupaki Desk | 17 March 2025 9:00 AM ISTటాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకున్న మలయాళ భామల్లో సంయుక్త మీనన్ ఒకరు. మొన్నటిదాకా మలయాళంలో వరుస సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను అలరించిన అమ్మడు భీమ్లా నాయక్ తో తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. 2023 లో సార్, విరూపాక్ష, డెవిల్ సినిమాలతో వచ్చిన సంయుక్త అందులో రెండు సినిమాలు హిట్ అందుకున్నా ఎందుకో కెరీర్ జోష్ అందుకోలేదు.
లాస్ట్ ఇయర్ లవ్ మీ సినిమాలో కెమియో రోల్ చేసిన సం యుక్త ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు సినిమా చేస్తుంది. దానితో పాటు శర్వానంద్ తో నారి నారి నడుమ మురారి సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇవే కాకుండా నందమూరి బాలకృష్ణ అఖండ 2 లో కూడా అవకాశం పట్టేసింది. ఐతే సినిమా సినిమాకు అమ్మడు తీసుకుంటున్న గ్యాప్ ఆమెను కెరీర్ లో వెనకబడేలా చేస్తుంది.
సంయుక్త చేతిలో ప్రస్తుతం 3 సినిమాలు ఉన్నా ఆమె మాత్రం టాలీవుడ్ కి చాలా దూరంగా ఉన్నట్టు ఉంది. అంతేకాదు చేస్తున్న సినిమాల గురించి అమ్మడు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఆడియన్స్ కి దగ్గర అవ్వట్లేదు. అఖండ 2 సినిమా ఈ ఇయర్ దసరాకి వస్తుందని టాక్ ఉంది. ఆ సినిమా తో మళ్లీ కెరీర్ లో జోష్ తెచ్చుకోవాలని చూస్తుంది సం యుక్త.
ఇక స్వయంభు సెట్స్ మీద ఉంది కానీ ఆ సినిమా ఎక్కడిదాకా వచ్చింది అన్నది మాత్రం తెలియలేదు. మరోపక్క శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా మాత్రం కుదిరితే ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సంయుక్త మీనన్ తెలుగులో సినిమాలు చేస్తున్నా కూడా ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించని సం యుక్త మళ్లీ రెగ్యులర్ టచ్ లోకి వస్తే బెటర్ అని అంటున్నారు ఆమె ఫాలోవర్స్. సంయుక్త మీనన్ కూడా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతుంది. అందుకే ఇక్కడ ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే అసలు వదలకూడదని ఫిక్స్ అయ్యింది. రాబోతున్న 3 సినిమాలతో మళ్లీ టాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు.