Begin typing your search above and press return to search.

నిర్మాతగా 'సార్‌' బ్యూటీ..!

ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమాతో రాని సంయుక్త మీనన్ వచ్చే ఏడాదిలో మూడు నాలుగు సినిమాలతో రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 12:30 PM GMT
నిర్మాతగా సార్‌ బ్యూటీ..!
X

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌ తెలుగు లో భీమ్లా నాయక్‌ సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో హీరోయిన్ గా కాకున్నా తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత వరుసగా బింబిసార, సార్‌, విరూపాక్ష సినిమాలతో సక్సెస్ ను దక్కించుకుంది. లక్కీ బ్యూటీ అంటూ పేరు సొంతం చేసుకున్న సంయుక్తం మీనన్ ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్య తగ్గించింది. వరుసగా సినిమాలు చేయకుండా ఆచితూచి సినిమాలకు కమిట్‌ అవుతున్న ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌ ప్రస్తుతం నాలుగు అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమాతో రాని సంయుక్త మీనన్ వచ్చే ఏడాదిలో మూడు నాలుగు సినిమాలతో రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఉందని తెలుస్తోంది. హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో అనూహ్యంగా ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె తీసుకున్న సాహస నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. రాజేష్ దండా నిర్మాణంలో ఒక భారీ లేడీ ఓరియంటెడ్‌ సినిమా రూపొందుతోంది. అందులో ఈమె హీరోయిన్‌ గా నటిస్తోంది.

ఈ మధ్య కాలంలో హీరోలు ఎక్కువ మంది తమ సినిమాల నిర్మాణ భాగస్వామ్యులుగా ఉంటున్నారు. కొందరు తమ సినిమాలను తామే సమర్పించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సంయుక్త మీనన్ తన పారితోషికంతో పాటు కొంత మొత్తాన్ని సినిమాలో పెట్టి సమర్పకురాలిగా వ్యవహరించబోతుంది. ఇప్పటి వరకు సంయుక్త చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ మొదటి సారి నిర్మాతగా సినిమాను చేసేందుకు సిద్ధం అయింది. తన నిర్మాణంలో తానే హీరోయిన్‌ గా నటిస్తున్న కారణంగా కచ్చితంగా సినిమాలో మ్యాటర్‌ ఉంటుంది అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

సంయుక్త మీనన్‌ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్‌, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజేష్ దండా నిర్మాణంలో ప్రస్తుతం సంయుక్త మీనన్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ కథ మొదట సమంత వద్దకు వెళ్లిందట. ఆ సినిమా కథ ను సమంత ఓకే చెప్పింది. కానీ సమయం కావాలంటూ అడిగింది. చాలా రోజులు సమంత డేట్ల కోసం వెయిట్‌ చేసిన రాజేష్ దండా చివరకు ఆమె డేట్లు లభించక పోవడంతో చేసేది లేక సంయుక్త మీనన్ తో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి.