Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ట్రెడిషనల్ లుక్ లో క్రేజీ బ్యూటీ

నేడు సంయుక్త మీనన్ పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ మేకర్స్ ఆమె పోస్టర్ ని విడుదల చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 7:01 AM GMT
పిక్ టాక్‌ : ట్రెడిషనల్ లుక్ లో క్రేజీ బ్యూటీ
X

టాలీవుడ్‌ లో వరుస విజయాలను సొంతం చేసుకుని గోల్డెన్ లెగ్ బ్యూటీ అనిపించుకున్న ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఈ లక్కీ బ్యూటీ ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌ తాజా చిత్రం 'డెవిల్‌' లో నటిస్తున్న విషయం తెల్సిందే. నేడు సంయుక్త మీనన్ పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ మేకర్స్ ఆమె పోస్టర్ ని విడుదల చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


నిషాద అనే పాత్రలో సంయుక్త మీనన్ డెవిల్‌ సినిమాలో కనిపించబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ ఏడాది నవంబర్‌ 24న విడుదల కాబోతున్న డెవిల్ పై అంచనాలు పెంచే విధంగా సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ ఉందంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. డెవిల్‌ కు తగ్గ బ్యూటీ అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చీర కట్టు లో సంప్రదాయ లుక్ లో డెవిల్ బ్యూటీ కొబ్బరికాయ, పూలు పట్టుకుని ఆలయ సందర్శణకు వెళ్తున్నట్లుగా ఫస్ట్‌ లుక్ లో చూపించడం జరిగింది. హీరో కళ్యాణ్ రామ్‌ లుక్ కి, ఈమె లుక్ కి పూర్తి వైవిధ్యభరితంగా ఉండటంతో కథ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

శ్రీకాంత్‌ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అభిషేక్ నామా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నారు. 1940 నేపథ్యం లోని కథతో ఈ సినిమా ను రూపొందిస్తున్న నేపథ్యం లో పదుల కొద్ది భారీ సెట్టింగ్స్ ను నిర్మించి నేచురాలిటీ కి దగ్గరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.