డాడీ మీద కోపంతోనే 'మీనన్' ని లేపేసా!
'అమ్మ నాన్న విడిపోయారు. అమ్మ అంటే ఎంతో ఇష్టం. అంతే గౌరవం. తన ఫీలింగ్స్ అన్నింటిని గౌరవించి పేరులో నుంచి సర్ నేమ్ తీసేసాను.
By: Tupaki Desk | 11 Aug 2024 6:03 AM GMTమలయాళం బ్యూటీ సంయుక్తా మీనన్ గురించి పరిచయం అవసరం లేదు. 'భీమ్లా నాయక్' తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడ కెరీర్ టాలీవుడ్ లో తిరుగు లేకుండా సాగిపోతుంది. 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' లాంటి హిట్ సినిమాలతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. అన్నింటిని మించి ఆరంభంలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రశంసలందుకునే ఎంట్రీ ఇచ్చింది. ఆయన ఆశీర్వాదం కూడా కలిసొచ్చింది.
గతేడాది నాలుగైదు సినిమాలో ప్రేక్షకుల ముందుకొచ్చిన అమ్మడు 2024 లో మాత్రం రిలాక్స్ అవుతుంది. కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. అయితే నిఖిల్ తో మాత్రం పాన్ ఇండియా సినిమా 'స్వయంభూ'లో నటిస్తోంది. తాజాగా బాలీవుడ్ కి కూడా ప్రమోట్ అయింది. ఇలా కెరీర్ పరంగా సంయుక్తా మీనన్ ఎలాంటి ఢోకాలేదు.
అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం మనసు గాయపడిన సందర్భం గుర్తు చేసుకుంది. సంయుక్తా మీనన్ నుంచి 'మీనన్' పేరును తొలగించింది. అయితే ఇలా మీనన్ ని తొలగించడంపై నేరుగా ఆమెనే ప్రశ్నించడంతో ఆసక్తికర సమాధానం చెప్పింది. 'అమ్మ నాన్న విడిపోయారు. అమ్మ అంటే ఎంతో ఇష్టం. అంతే గౌరవం. తన ఫీలింగ్స్ అన్నింటిని గౌరవించి పేరులో నుంచి సర్ నేమ్ తీసేసాను.
నేను ఆడ, మగ సమానం అనే నమ్ముతానం. ఎవరూ ఎక్కువ కాదు..తక్కువ కాదు. నా జీవితంలో అలాంటి సందర్భం ఎదురైందని పురుషలందరి విషయంలో ఒకేలా ఉండటం అన్నది పెద్ద తప్పు. నా కుటుం బంలో జరిగిన సంఘటన అంత వరకే పరిమితం. అంతకు మించి తప్పుగా భావించాల్సిన పనిలేదు' అని తెలిపింది.