నలుగు పెట్టుకుని సంయుక్తా మీనన్ స్నానం
తమ సంప్రదాయంలో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేస్తారో అమ్మడు రివీల్ చేసింది.
By: Tupaki Desk | 14 Jan 2024 7:31 AM GMTభోగి పండగ వచ్చిందంటే? తెల్లవారు జామునే లేచి ఒళ్లంతా నలుగు రుద్ది తలస్నానం చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ లో ఈ కల్చర్ చాలా కాలంగా ఉంది. కోడి కూత పెట్టక ముందు నుంచే అన్ని కుటుంబాల్లో నలుగు రుద్దడం మొదలవుతుంది. ఇలాంటి వాటికి తానేమి అతీతం కాదంటోంది కేరళ కుట్టి సంయుక్తా మీనన్. తమ సంప్రదాయంలో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేస్తారో అమ్మడు రివీల్ చేసింది. ఆవేంటో ఆమె మాటల్లోనే..
`కేరళలోని ఓ పల్లెటూరి లో పుట్టి పెరిగాను. నాపైనా అమ్మ నాన్నల ప్రభావం చాలా ఎక్కువ. చిన్నతనంలో శ్లోకాలు నేర్పించారు. ఆథ్యాత్మిక పుస్తకాలు దగ్గరుండి చదివించారు పేరెంట్స్. పండగలప్పుడు పూజలు చేయించడం అలవాటు. ఉదయాన్నే లేచి నలుగు పెట్టుకుని తలస్నానం చేసి సూర్యుడికి నీళ్లు..పూలు సమర్పిస్తుంది అమ్మ. నేను నలుగు పెట్టుకుని స్నానం చేస్తాను. ఇలా నలుగు రాయడం శరీరానికి ఎంతో మంచిదని పెద్దలు చెప్పేవారు.
అది నిజమే అనిపిస్తుంది. నలుగు పెట్టి రుద్దితే శరీరమంతా రక్త ప్రసరణ ఎంతో బాగా జరుగుతుంది. ఆ రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటాం. సూర్య నమస్కారం అయిన తర్వాత పాలు పొంగించి పరమాన్నం వండుతుంది అమ్మ. నేను మాత్రం ఆ సమయంలో స్నేహితులతో కలిసి గాలి పటం ఎగర వేస్తాం. పంట పొలాలకు వెళ్లి సరదాగా గడుపుతాం. సాయంత్రం పూట మాత్రం ఆధ్మాత్మిక పుస్తకాలు తప్పకుండా చదు వుతాం. నాకెంతో ఇష్టమైన శివుడిని ఆరాదిస్తా` అని అంది.
మొత్తానికి సంయుక్తా మీనన్ సంక్రాంతిని ఏటా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంటుందని ఆమె మాటల్ని బట్టి తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సంయుక్తా మీనన్ సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కేరళలోని కుటుంబంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటో తెలియాలి.