Begin typing your search above and press return to search.

నచ్చకపోయినా అది చేయాల్సిందే.. తెలుగు సినిమాలపై షాకింగ్ కామెంట్స్..!

ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నా మలయాళ సినిమాలే బెటర్ అనేస్తుంటారు.

By:  Tupaki Desk   |   10 May 2024 5:30 PM GMT
నచ్చకపోయినా అది చేయాల్సిందే.. తెలుగు సినిమాలపై షాకింగ్ కామెంట్స్..!
X

మలయాళ భామలకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న చాలామంది హీరోయిన్స్ మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన వారే. అయితే వారిలో కొందరు కేవలం నటనతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే మరికొందరు అవకాశాల కోసం గ్లామర్ తో కూడా మెప్పించిన వారు ఉన్నారు. తమ సహజ నటనతో ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుస్తున్నారు మలయాళ భామలు. అయితే అక్కడ నుంచి వచ్చిన కొందరు భామలు తెలుగు సినిమాలు.. ఇక్కడ వాతావరణం తో అడ్జెస్ట్ అవ్వలేరు.


ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నా మలయాళ సినిమాలే బెటర్ అనేస్తుంటారు. లేటెస్ట్ గా అలాంటి కామెంట్స్ తోనే ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది మలయాళ భామ సంయుక్త మీనన్. అక్కడ ఆల్రెడీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంయుక్త తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుస సినిమాలు సక్సెస్ అందుకుంది. తెలుగులో హిట్ ఇచ్చిన హీరోయిన్ కి సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది.

వరుస సక్సెస్ లతో సంయుక్త మీనన్ కు కూడా టాలీవుడ్ లో సూపర్ పాపులారిటీ వచ్చింది. తెలుగులో ఇంత మంచి క్రేజ్ తెచ్చుకున్న సంయుక్త ఇక్కడ సినిమాలు చేయడం అంత సౌకర్యవంతంగా లేదని అంటుంది. మలయాళంతో పోల్చుకుంటే తెలుగు సినిమాల్లో నటించడం కష్టమని అంటుంది అమ్మడు. ఎందుకంటే మలయాళం సినిమాల్లో చాలా లైట్ మేకప్ వేసుకుంటాం కానీ ఇక్కడ మేకప్ ఎక్కువ వేస్తారు. ఇంత భారీ మేకప్ తో తెరపై ఎలా కనిపిస్తామా అన్న డౌట్ వచ్చి ప్రతిసారి చెక్ చేసుకోవాల్సి వస్తుందని అంటుంది సంయుక్త.

ముఖం మీద ఏదో ఉన్నట్టు ఇక్కడ మేకప్ ఉంటుందని షాకింగ్ కామెంట్ చేసింది సంయుక్త. ప్రస్తుతం సంయుక్త చేసిన ఈ కామెంట్స్ తెలుగు మేకర్స్ ని మాత్రమే కాదు ఆడియన్స్ ని కూడా సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే మలయాళ సినిమాలు రియలిస్టిక్ గా.. సహజత్వానికి దగ్గరగా సినిమాలు చేస్తుంటారు. అక్కడ లైట్ మేకప్ లేదా అసలు మేకప్ లేకపోయినా నడిచిపోద్ది.. కానీ టాలీవుడ్ లో అలా కాదు.. తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ ఎక్కువ వాడుతుంటారు. పాన్ ఇండియా రేంజ్ ఆడియన్స్ ని మెప్పించాలంటే విజువల్ గ్రాండియర్ గా ఉండాలి. అందుకు తగినట్టుగా మేకప్ వేసుకోవాలి.

సంయుక్త తన పర్సనల్ ఎక్స్ పీరియన్స్ చెప్పినా తెలుగులో మంచి అవకాశాల వస్తున్న టైం లో ఆమె చేసిన ఈ కామెంట్స్ తెలుగు ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్నాయి. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ సినిమాలో నటిస్తున్న సంయుక్త బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో కూడా సెలెక్ట్ అయ్యింది. మరి తెలుగు సినిమాల్లో నటించడం కష్టం అక్కడ మేకప్ కోసం ఎక్కువ కష్టపడాలని అంటున్న సంయుక్త కామెంట్స్ ని ఇండస్ట్రీ వాళ్లు ఎలా తీసుకుంటారన్నది చూడాలి.