Begin typing your search above and press return to search.

అదే టెక్నిక్ అక్క‌డా అప్లై చేస్తుందా?

ప్ర‌భుదేవా-కాజోల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఓ చిత్రంతో సంయుక్తా మీన‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

By:  Tupaki Desk   |   27 May 2024 10:30 AM GMT
అదే టెక్నిక్ అక్క‌డా అప్లై చేస్తుందా?
X

నార్త్ లో సౌత్ భామ‌ల ఎంట్రీ జోరుగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌, కీర్తి సురేష్‌, ర‌ష్మిక మంద‌న్నా లాంటి భామ‌లు బాలీవుడ్ లోనూ స‌క్సెస్ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ న‌టించ‌డానికి సిద్దంగా ఉంటున్నారు. తాజాగా ఇదే కోవ‌లో సంయుక్తా మీన‌న్ కూడా నార్త్ లో ఎంట్రీ షురూ చేసింది. ప్ర‌భుదేవా-కాజోల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఓ చిత్రంతో సంయుక్తా మీన‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

అమ్మ‌డికిదే తొలి సినిమా. హీరోయిన్ ఛాన్స్ కోస‌మే ఎదురు చూడ‌కుండా వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకోవాలి అన్న ఐడియాతో లాంచ్ అవుతుంది. అయితే అక్క‌డా టాలీవుడ్ త‌ర‌హా స్ట్రాట‌జీని స‌క్సెస్ దిశ‌గా ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఏ భాష‌లోకి వెళ్లినా అక్క‌డి ప‌రిస్థితుల్ని, ప‌ని విష‌యంలో ప‌ద్ద‌తుల్ని వెంట‌నే ఆక‌ళింపు చేసుకుని న‌టించ‌డం అల‌వాటైంది. అది తెలుగు సినిమానే నేర్పిందంటూ' అ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన 'భీమ్లానాయ‌క్' సినిమాతో తెలుగులో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కిముందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఓ సినిమా వేడుక‌లో అత‌ని వ్య‌క్తిత్వాన్నిఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు అమ్మ‌డికి ఇక్క‌డ మంచి మైలేజ్ ని తీసుకొచ్చాయి. రిలీజ్ కి ముందే ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌వన్ అభిమానుల్లో ప్ర‌త్యేకంగా నిలిచింది. ప‌వ‌న్ అభిమానులంతా ఆమెని సోష‌ల్ మీడియాలో లైక్ చేయ‌డం మొద‌లైంది.

అటుపై న‌టించిన 'బింబిసార‌'..'సార్' లాంటి చిత్రాల‌కు అమ్మ‌డికి న‌టిగా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. 'విరూపాక్ష‌'తో వంద కోట్లు వ‌సూళ్లు సాధించిన చిత్రంలోనూ భాగ‌మైంది. కానీ అనూహ్యంగా తెలుగు సినిమాలు హోల్డ్ లో పెట్టి బాలీవుడ్ వైపు ఆస‌క్తి చూపిస్తుంది. మ‌రి అక్క‌డ కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే స్ట్రాట‌జీ అప్లై చేస్తుందా? అన్న‌ది చూడాలి.