Begin typing your search above and press return to search.

సంయుక్త రొమాంటిక్ టర్న్.. కుర్రాళ్లు వెయిటింగ్..!

By:  Tupaki Desk   |   21 Jun 2024 3:00 AM GMT
సంయుక్త రొమాంటిక్ టర్న్.. కుర్రాళ్లు వెయిటింగ్..!
X

టాలీవుడ్ ఎంట్రీతోనే వరుస హిట్లతో ఒక రేంజ్ ఫాం తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులేస్తుందని తెలుస్తుంది. విరూపాక్ష హిట్ తర్వాత కళ్యాణ్ రాం తో డెవిల్ సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు సినిమా చేస్తున్న సంయుక్త హిందీలో మహారగ్ని లో కూడా ఛాన్స్ అందుకుంది. మలయాళంలో కూడా రామ్ అనే సినిమాతో వస్తుంది అమ్మడు.

అందంతో పాటు అభినయం తో కూడా అలరించే సంయుక్త కథానాయికగా డిఫరెంట్ స్టోరీస్ కే ఓటు వేస్తుంది. సంయుక్త సినిమా ఓకే చేసింది అంటే అందులో కచ్చితంగా విషయం ఉంటుందని ఆడియన్స్ కూడా ఫిక్స్ అవుతున్నారు. ఐతే సంయుక్త కమర్షియల్ సినిమాల్లో కూడా నటించాలని.. ఆమెను గ్లామర్ రోల్స్ లో చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సంయుక్త కంప్లీట్ గా రొమాంటిక్ సినిమాలో నటిస్తే చూడాలని ఉందని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు.

పర్ఫెక్ట్ షేప్ తో స్టార్ కటౌట్ ఉన్న సంయుక్త రొమాంటిక్ సినిమాలు చేయాలనే ఆలోచన చేస్తే మాత్రం ఆమెను ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్లు సంయుక్త ని తన నటనతోనే ఇష్టపడ్డారు. ఇక మీదట ఆమె అందంతో కూడా మెప్పించాలని చూస్తే మాత్రం ఆమెకు సాటి ఎవ్వరు ఉండరని అంటున్నారు. ఐతే రొమాంటిక్ సినిమా అంటే అదేదో బూతులా కాకుండా కమర్షియల్ సినిమాలానే కానీ రొమాంటిక్ టచ్ ఉండేలా చేస్తే బాగుంటుందని అంటున్నారు.

ఐతే మలయాళం హీరోయిన్స్ ఎక్కువగా పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తారు. మరీ కథ నచ్చి బోల్డ్ రోల్స్ ఓకే చేస్తారు తప్ప సహజంగానే వారు రొమాంటిక్ పాత్రలు చేయడం కష్టం. ఐతే సంయుక్త నుంచి మాత్రం అలాంటి సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎలాగు తన అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైన సంయుక్త నెక్స్ట్ స్టెప్ గా గ్లామర్ రోల్స్ కూడా చేసింది అంటే కచ్చితంగా అమ్మడి ఇమేజ్ డబుల్ అవుతుందని చెప్పొచ్చు. మరి సంయుక్త ని అలాంటి పాత్రలో నటించేలా చేసే కథ ఎప్పుడు వస్తుందో చూడాలి. తెలుగులో స్వయంభు సినిమా మాత్రమే చేస్తున్న సంయుక్త కోలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకుంటుందని తెలుస్తుంది.