Begin typing your search above and press return to search.

శ్రీలీల అలా, సంయుక్త ఇలా...!

సంయుక్త మీనన్ కాస్త తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే శ్రీలీల మాదిరిగా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   31 July 2023 4:42 AM GMT
శ్రీలీల అలా, సంయుక్త ఇలా...!
X

పెళ్లిసందడి అనే సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. మొదటి సినిమా తో కమర్షియల్ గా నిరాశ ఎదురైనా కూడా ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాల సంఖ్య ఏ రేంజ్‌ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు సినిమాల తో పాటు ఇంకా పలువురు యంగ్ స్టార్ హీరోల తో సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

మొదటి సినిమా సక్సెస్‌ కాలేదు.. ఇప్పటి వరకు ధమాకా సినిమా మాత్రమే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి శ్రీలీల ఈ రేంజ్ లో దూసు కు పోతూ ఉంటే గోల్డెన్‌ బ్యూటీ అంటూ పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ మాత్రం వరుస సినిమాలు చేయలేక పోతుంది.

సంయుక్త మీనన్ కు ఆఫర్లు రావడం లేదా... వచ్చినా కూడా ఆమె చేయడం లేదా అనేది పెద్ద అనుమానంగా ఉంది. సంయుక్త మీనన్‌ తెలుగు లో చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతే కాకుండా ఆమె అందాల విందు చేయడం లో కూడా ముందు ఉంటుంది. నటిగా కూడా మంచి మార్కులు దక్కించుకుంది.

ముఖ్యంగా విరూపాక్ష సినిమా తో వంద కోట్ల మూవీ ని దక్కించుకుంది. సార్‌ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతా లో వేసుకుంది. ఇలా ప్రతి ఒక్క సినిమా తో డీసెంట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్‌ లో చేస్తున్న సినిమా ఏదీ అంటే ఠక్కున చెప్పడానికి లేదు.

ఆమె వద్దకు వచ్చిన ఆఫర్ల విషయం లో సరైన నిర్ణయం తీసుకోవడం లో విఫలం అవుతుందా లేదంటే ఆమె వద్దకు ఆఫర్లు రావడం లేదా అంటూ ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్స్ కొరత చాలా ఉంది. ఇలాంటి సమయం లో సంయుక్త మీనన్ కాస్త తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే శ్రీలీల మాదిరిగా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.