ఛాన్స్ అడిగితే పడక గదికి పిలుస్తారు: నటి ఆవేదన
బెంగళూరుకు చెందిన సనమ్ శెట్టి తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది.
By: Tupaki Desk | 19 Feb 2025 5:50 PM GMTసినీపరిశ్రమలో వేధింపుల గురించి, ముఖ్యంగా తమిళ చిత్రసీమలో అంతర్గత విషయాల గురించి బయటపెట్టింది సనమ్ శెట్టి. తమిళ చిత్ర పరిశ్రమలోని దర్శకనిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బెంగళూరుకు చెందిన సనమ్ శెట్టి తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది. మహేష్ బాబు 'శ్రీమంతుడు', సంపూర్ణేష్ బాబు 'సింగం 123' సహా పలు చిత్రాలలో శెట్టి సహాయక పాత్రలు పోషించింది.
అయితే ఇతర పరిశ్రమల కంటే, కోలీవుడ్ లో సుదీర్ఘ కాలం నటనలో కొనసాగింది. 2019 బిగ్ బాస్ తమిళ సీజన్‌లో కూడా పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సనమ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేసారు. వేట్రిమారన్ నిర్మించిన తమిళ చిత్రం 'బ్యాడ్ గర్ల్'ను సనమ్ శెట్టి తీవ్రంగా విమర్శించారు. ఇది యువతులలో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందని శెట్టి అన్నారు. ఆడా మగ సమానత్వం గురించి చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో ఈ చిత్రం సమానత్వాన్ని సమర్థించదని ఆమె పేర్కొంది.
తమిళ ఫిలింమేకర్స్ ఎక్కువ మంది మహిళా తారలను నటన కోసం కాకుండా లైంగిక సంబంధాల కోసం తమ ఇళ్లకు ఆహ్వానిస్తారని సనమ్ శెట్టి తీవ్రంగా ఆరోపించారు. అలాగే ఆడా మగా నటుల మధ్య సమానత్వం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. ఆ ఇద్దరికీ సమాన వేతనాలు అందుతున్నాయా? నటీనటులను ఒకే విధంగా ఫిలింమేకర్స్ సంప్రదిస్తారా? అని ప్రశ్నించింది. ఇవన్నీ నా అనుభవం నుండి చెబుతున్నాను అని కూడా అన్నారు. సినిమాల్లో నటించమని పిలుస్తారని మనం అనుకుంటే, వారితో పడుకోవడానికి పిలుస్తారు! అని సనమ్ శెట్టి వ్యాఖ్యానించారు.