Begin typing your search above and press return to search.

బ్యాడ్ గర్ల్ టీజర్.. సనం శెట్టి ఫుల్ ఫైర్!

కోలీవుడ్, బాలీవుడ్ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సంయుక్త నిర్మాణంలో బ్యాడ్ గర్ల్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2025 11:03 AM GMT
బ్యాడ్ గర్ల్ టీజర్.. సనం శెట్టి ఫుల్ ఫైర్!
X

కోలీవుడ్, బాలీవుడ్ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సంయుక్త నిర్మాణంలో బ్యాడ్ గర్ల్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. వర్ష భరత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో అంజలి శివరామన్ లీడ్ రోల్ లో నటిస్తోంది. రీసెంట్ గా మేకర్స్.. రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

రియల్ లైఫ్ రిఫ్లెక్ట్ చేసే కథతో రూపొందుతున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. స్కూల్ చదువుతున్నప్పటి నుంచే తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండాలని కోరుకునే ఓ బ్రాహ్మణ అమ్మాయి జీవితంలో జరిగిన పరిణామాలతో సినిమా ఉండనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. దీంతో టీజర్.. ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కొందరు సెలబ్రిటీలు మద్దతు తెలపగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. విమర్శలు కూడా గుప్పించారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 తమిళ ఫేమ్ సనం శెట్టి రెస్పాండ్ అయింది. బ్యాడ్‌ గర్ల్‌ టీజర్‌ బోల్డ్ ఎగ్జాంపుల్ కాదని.. బ్యాడ్ ఎగ్జాంపుల్ అని తెలిపిన ఆమె.. మైనర్లను తప్పుగా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించింది.

"బ్యాడ్‌ గర్ల్‌ మూవీ టీజర్‌ టీనేజీ అమ్మాయిలను చెడగొట్టేలా అనిపిస్తోంది. బాధ్యతాయుతమైన చిత్ర నిర్మాతలు నిధులు సమకూర్చి ఇలాంటి సినిమాలు తీయడం బాధాకరం. స్వేచ్ఛ, లింగ సమానత్వం అనే అంశాలను మేకర్స్ చాలా తప్పుగా చూపించారు. సిగరెట్‌ తాగడం, మందు తాగడం సమానత్వం కాదు" అని తెలిపింది.

ఇప్పుడు సనం శెట్టి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. అనేక మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం.. వార్తల్లో నిలిచేందుకు ఆమె అలాంటి కామెంట్స్ చేసిందని చెబుతున్నారు. ఆమెపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

ఏదేమైనా టీజర్ రిలీజ్ తర్వాత.. బ్యాడ్ గర్ల్ మూవీ చుట్టూ వివాదాలు నెలకొన్నాయనే చెప్పాలి. దీంతో మేకర్స్.. సినిమా థియేట్రికల్ రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. 2025లో ప్రేక్షకుల ముందుకు మూవీ వస్తుందని టాక్ వినిపించినా.. మేకర్స్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. మరి బ్యాడ్ గర్ల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.