Begin typing your search above and press return to search.

సందీప్ రెడ్డి వంగా.. 13ఏళ్ల క్రితమే నటుడిగా ఇలా..

తాజాగా సందీప్ రెడ్డి వంగాకి సంబందించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. నాగార్జున హీరోగా కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన కేడీ సినిమాలో ఒక సీన్ లో సందీప్ రెడ్డి వంగా కనిపిస్తాడు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 4:49 AM GMT
సందీప్ రెడ్డి వంగా.. 13ఏళ్ల క్రితమే నటుడిగా ఇలా..
X

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ కొట్టడంతో యూత్ కి చేరువ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాలో హిందీలో కబీర్ సింగ్ గా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత యానిమల్ మూవీతో మరల దర్శకుడిగా సందీప్ రెడ్డి ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ట్రైలర్ తో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ రెట్టింపు అయిపోయాయి. దీని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీని సందీప్ స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా కమిటై ఉన్నాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. సందీప్ రెడ్డి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే కెరియర్ స్టార్ట్ చేసి తక్కువ టైంలోనే డైరెక్టర్ గా అర్జున్ రెడ్డి సినిమాతో ప్రమోషన్ అందుకున్నారు.

అయితే ప్రతి దర్శకుడు కెరియర్ ఆరంభంలో ఏదో ఒక సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. అయితే వారు డైరెక్టర్స్ గా సక్సెస్ అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆ సినిమాలకి సంబందించిన వీడియోలు బయటకి వస్తూ ఉంటాయి. తాజాగా సందీప్ రెడ్డి వంగాకి సంబందించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. నాగార్జున హీరోగా కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన కేడీ సినిమాలో ఒక సీన్ లో సందీప్ రెడ్డి వంగా కనిపిస్తాడు.

డార్క్ క్రైమ్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇందులో సముద్రంలో ఓ నాటు బోటు లో కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అదే సమయంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది వచ్చి షూట్ చేస్తారు. ఆ సీన్ లో సందీప్ రెడ్డి నటించాడు అంటూ వీడియోని ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు. వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం అచ్చం సందీప్ రెడ్డి వంగా లాగే ఉన్నారు.

మరి అందులో నటించింది తానా కాదా అనేది అతను క్లారిటీ ఇస్తేనే తెలిసే అవకాశం ఉంది. యానిమల్ రిలీజ్ ముందు ఇలా సందీప్ రెడ్డి వంగా నటించినట్లు చెప్పబడుతున్న వీడియో వైరల్ కావడం నిజంగా విశేషమని చెప్పాలి. ఇక సందీప్ మహానటి సినిమాలో ఒకప్పటి దర్శకుడు వేదాంతం రాఘవయ్య పాత్రలో కనిపించన విషయం తెలిసిందే.