350 మందికి హీరో రోజు అన్నదానం!
ఆకలితో ఉన్నవారికి తన ఏడు రెస్టారెంట్స్ నుంచి ప్రతిరోజు 350 మందికి ఫ్రీగా ఫుడ్ పెట్టడం జరుగుతుంది. తాజాగా సందీప్ కిషన్ ఈ విషయమై 'ఎక్స్' వేదికగా ఒక పోస్టు పెట్టారు.
By: Tupaki Desk | 22 Oct 2024 9:20 AMటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉన్న కొద్ది మంది ట్యాలెంటెడ్ నటుల్లో అతడు ఒకరు. సినిమాటోగ్రాఫర్ ఛోటాకే నాయుడు మేనల్లుడు అయినా ఇండస్ట్రీలో తన ట్యాలెంట్ తోనే ఎదిగాడు. ఇప్పటికే చాలా సినిమాలు చేసాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేసాడు. ధనుష్ లాంటి స్టార్ హీరోతోనూ కలిసి పనిచేస్తున్నాడు.
నటుడిగా అతడె ప్పుడు ఖాళీగా లేడు. ఏదో సినిమాతో బిజీగానే ఉంటున్నాడు. అలాగే అతడు సక్సెస్ పుల్ గా 'వివాహ భోజనంబు' అనే రెస్టారెంట్ ని కూడా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తం ఏడు రెస్టారెంట్ లు ఉన్నాయి. అయితే ఈ రెస్టారెంట్ లు కేవలం తనకు డబ్బు తెచ్చిపెట్టడానికి మాత్రమే కాదు..ఆకలితో అలమటించే అన్నార్తుల ఆకలి తీర్చడానికి అని కూడా సందీప్ కిషన్ రుజువు చేస్తున్నాడు. అన్నదానంతో తన ఉదారతను చాటుతున్నాడు.
ఆకలితో ఉన్నవారికి తన ఏడు రెస్టారెంట్స్ నుంచి ప్రతిరోజు 350 మందికి ఫ్రీగా ఫుడ్ పెట్టడం జరుగుతుంది. తాజాగా సందీప్ కిషన్ ఈ విషయమై 'ఎక్స్' వేదికగా ఒక పోస్టు పెట్టారు. తన టీమ్ పేదలకు భోజనం పంచుతున్న ఫొటోలను పోస్ట్ ద్వారా హీరో పంచుకున్నారు. 'వివాహ భోజనంబు టీమ్ చేస్తున్న పనికి నేను గర్వపడుతున్నాను. మీలో ఎవరైనా భోజనం కోసం కష్టపడితే మీ సమీపంలోని వివాహ భోజనంబు రెస్టారెంట్‌కి నేరుగా వెళ్లి ఫుడ్ ప్యాకెట్‌ను ఉచితంగా తీసుకోండి' అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.
దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. సందీప్ కిషన్ మంచి మనసులు నెటి జనులు ఫిదా అవుతున్నారు. ఇతడు ఇంత దాతృహృదయం గలవాడు.ఇంతటి సేవాతత్పరుడా? గ్రేట్ అంటూ ప్రశంశిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుతున్నారు. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది.