డబుల్ ఎంటర్టైన్మెంట్ తో మజాకా ట్రైలర్
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మజాకా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.
By: Tupaki Desk | 23 Feb 2025 7:53 AM GMTపీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మజాకా. సందీప్ కెరీర్లోనే మొదటిసారి చేస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాగా మాజాకా రూపొందింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రీతూ వర్మ, రావు రమేష్, అన్షు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా మజాకాను నిర్మించాడు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మజాకా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ట్రైలర్ లో సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ తో పాటూ రావు రమేష్ తో కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కవుట్ అయింది. మజాకాలో రావు రమేష్, అన్షు లవ్ ట్రాక్ మరింత ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్, నవ్వులు కురిపించేలాగా ఉండనున్నట్లు అర్థమవుతుంది.
అన్షుతో లవ్ ట్రాక్ లో భాగంగా రావు రమేష్ కు స్పెషల్ సాంగ్స్, డ్యాన్సు స్టెప్పులు కూడా ఉన్నట్టున్నాయి. ట్రైలర్ లో రావు రమేష్ వేసిన స్టెప్పు కూడా భలే స్టైల్ గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే త్రినాథరావు నక్కిన ఆడియన్స్ కోసం మరో కామెడీ ఎంటర్టైనర్ ను రెడీ చేసినట్టు అనిపిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ కథ మరోసారి ఆకట్టుకునేలానే ఉంది.
లియోన్ జేమ్స్ సంగీతంతో పాటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు తగ్గట్టుగానే ఉండగా, విజువల్స్, నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. మొత్తానికి మజాకా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న ఈ సినిమా విజయంపై సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.