Begin typing your search above and press return to search.

'మజాకా' ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎంతంటే?

రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు.. రూ.9 కోట్లకు అమ్మినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా రూ.11 కోట్లకు పైగా సేల్ చేసినట్లు వినికిడి.

By:  Tupaki Desk   |   22 Feb 2025 5:42 PM GMT
మజాకా ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎంతంటే?
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్.. మజాకా మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. మన్మధుడు ఫేమ్ అన్షూ కీలక పాత్రలో సందడి చేయనుంది.

సీనియర్ నటుడు రావు రమేష్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. బెజవాడ ప్రసన్న కుమార్ రచయితగా వ్యవహరిస్తున్నారు. దీంతో మజాకాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. త్రినాథ రావు నక్కిన, ప్రసన్న కుమార్ ది సూపర్ హిట్ కాంబో. వాళ్లిద్దరూ కలిసి వర్క్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి.

దీంతో ఫిబ్రవరి 26వ తేదీ రిలీజ్ కానున్న మజాకా కూడా హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మజాకా థియేట్రికల్ బిజినెస్ రీసెంట్ గా జరిగినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు.. రూ.9 కోట్లకు అమ్మినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా రూ.11 కోట్లకు పైగా సేల్ చేసినట్లు వినికిడి.

అయితే ఇప్పటికే డిజిటల్ తో పాటు శాటిలైట్ టెలికాస్ట్ హక్కుల్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ జీ గ్రూప్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి. మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత జీ 5 ఓటీటీ, జీ తెలుగులో సినిమా రానుందన్నమాట. మార్చి 26 లేదా 28వ తేదీల్లో ఓటీటీలోకి మూవీ రానుందని టాక్.

ఇక సందీప్ కిషన్ 30వ సినిమాగా మజాకా రానుండగా.. మంచి హిట్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలతో సందీప్ కిషన్ సందడి చేస్తుండగా మరిన్ని ప్రమోషన్స్ చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు. రిలీజ్ కు అతి తక్కువ సమయం ఉన్నందున.. సరైన ప్లాన్ లో మూవీని ప్రమోట్ చేయాలని కోరుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, ఉమేష్ కె ఆర్ బన్సాల్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ బాణీలు కడుతున్నారు. మరి శివరాత్రి కానుకగా రిలీజ్ కానున్న మజాకా మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.