నటసింహం సినిమాలో జాతీయ అవార్డు డైరెక్టర్!
అయితే ఈ సినిమాలో `కలర్ ఫోటో` దర్శకుడు సందీప్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. ట్రైలర్ లో తాను కనిపించిన ప్రేమ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
By: Tupaki Desk | 5 Jan 2025 4:30 PM GMTగాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన `డాకు మహారాజ్` సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నారు. దర్శకుడు బాబి తనదమైన మార్క్ లో చిత్రాన్ని తీసినట్లు ట్రైలర్ తోనే తేలిపోయింది. మరీ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
అయితే ఈ సినిమాలో `కలర్ ఫోటో` దర్శకుడు సందీప్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. ట్రైలర్ లో తాను కనిపించిన ప్రేమ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. విజయవాడకు చెందిన తాను స్కూల్ చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాల్లోకి రావాలని ఎన్నో కలలు కన్నట్లు తెలిపాడు.` ఇప్పుడా కల బాలయ్య బాబు సినిమా తో నెరవేరుతుంది. అయితే అందుకు కారణం దర్శకుడు బాబి అని తెలిపారు. ఆయన అవకాశం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపాడు.
అలాగే దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ ఇలా స్పందించాడు.` బిగ్ ఫిల్మ్ కోసం ఫస్ట్ ఆడిషన్ చేసింది ఎవరు బాబు? సందీప్ నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. మంచి విజువల్స్ తో సినిమాని బాబి అదరగొట్టాడు. నట సింహం ప్రదర్శన వేరే లెవల్లో ఉంటుంది. తమన్ బావా బాలయ్య అంటే నీకు పూనకాలే అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి. తమన్ ...హరీష్ శంకర్ కి బాగా క్లోజ్ అని తెలుస్తోంది.
ఇద్దరు `బావ బావ` అంటూ ప్రేమగా పిలుచుకుంటారని ఈ సందర్బంగా బయట పడింది. ఇక సందీప్ రాజ్ దర్శ కుడిగా బిజీగా ఉన్నాడు. `కలర్ ఫోటో`కి జాతీయ అవార్డుతో మంచి గుర్తింపు దక్కింది. కానీ ఆ సినిమా కమర్శియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే అవార్డు బ్రాండ్ తో ఏదో రకంగా బిజీగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాలతో ` మోగ్లీ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.