Begin typing your search above and press return to search.

వాళ్ల‌కు కౌంట‌ర్ ఎటాక్ లా సందీప్ ప్లాన్ చేస్తున్నాడా?

ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి సైతం సందీప్ రెడ్డిని న్యూ ఏజ్ మేక‌ర్ గా అభివ‌ర్ణించారు. ఇంత‌కు మించి సందీప్ గురించి చెప్పాల్సింది ఏముంది.

By:  Tupaki Desk   |   3 March 2025 12:25 PM IST
వాళ్ల‌కు కౌంట‌ర్ ఎటాక్ లా సందీప్ ప్లాన్ చేస్తున్నాడా?
X

నవ‌త‌రం ద‌ర్శ‌కుల్లో సందీప్ రెడ్డి వంగా ఓ స్పెష‌లిస్ట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. చేసిన మూడు సినిమాలు పాన్ ఇండియాలో ఎలాంటి విజ‌యాలు న‌మోదు చేసాయో తెలిసిందే. ఓ క‌థ‌ని..అందులో పాత్ర‌ల్ని ఎంత బ‌లంగా చెప్పొచ్చో తానే ప్రూవ్ చేసాడు. సందీప్ రెడ్డిలో ఈ ట్యాలెంట్ న‌చ్చే అత‌డి వ‌ద్ద సినిమా మేకింగ్ నేర్చ‌కోవాల‌ని రాంగోపాల్ వ‌ర్మ లాంటి సంచ‌ల‌న‌మే అన్నాడు.

ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి సైతం సందీప్ రెడ్డిని న్యూ ఏజ్ మేక‌ర్ గా అభివ‌ర్ణించారు. ఇంత‌కు మించి సందీప్ గురించి చెప్పాల్సింది ఏముంది. అయితే అత‌డి క‌థ‌ల పట్ల‌, మేకింగ్ ప‌ట్లా అదే స్థాయిలో విమ‌ర్శ‌లు కూడా వ్య‌క్త‌మయ్యాయి అన్న‌ది అంతే వాస్త‌వం. క్రిటిక్స్ స‌హ మేధావ‌ర్గం సందీప్ సినిమాల్ని విమ‌ర్శించారు. అలాగ‌ని వాటిని సందీప్ లైట్ తీసుకోలేదు. త‌న వెర్ష‌న్ తాను సూటిగానే విమ‌ర్శ‌కుల‌కు చెప్పాడు.

అంతిమంగా మ‌హిళ‌ల్ని కించప‌ర‌చడం అన్న‌దే? సందీప్ క‌థ‌ల్లో హైలైట్ అయింది. అయితే తాజాగా సందీప్ రెడ్డి పూర్తి స్థాయిలో ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించడం విశేషం. సినిమా అంతా మ‌హిళా పాత్ర‌ల‌తోనే ఉంటుందన్నాడు. ఎక్క‌డా ఫీమేల్ పాత్ర క‌నిపించ‌ద‌ని... లేడీ ఆర్టిస్టుల‌కే పెద్ద పీట వేసి చేస్తానంటున్నాడు. కానీ ఈ సినిమా చేయ‌డానికి ఓ నాలుగైదేళ్లు అయినా స‌మ‌యం ప‌డుతుందంటున్నాడు. ప్ర‌స్తుతం త‌న వ‌ద్ద వేరే క‌థ‌లు ఉన్నాయని, ముందుగా వాటిని పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్నాడు.

మ‌రి ఇలా మ‌హిళ‌ల‌పై సినిమా చేస్తున్నారంటే గ‌తంలో వచ్చిన విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డుతుందా? అంటే అలాగేమీ ఉండ‌ద‌ని...లేడీ ఓరియేంటెడ్ సినిమా తీసినా? ఆ కోణంలో కూడా త‌న‌పై విమ‌ర్శ‌లు ఎక్కు పెడ‌తార‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఫీమేల్ యాంటీ ఓరియేంటెడ్ సినిమాలు చేయ‌డంలో ఉపెంద్ర అప్ప‌ట్లో ఓ వెలుగు వెలిగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌న ఆ త‌ర‌హా సినిమాలు చేయ‌డం మానేసాడు. మ‌ళ్లీ ఇంత కాలానికి సందీప్ ఉపెంద్ర‌కు భిన్నంగా మేల్ యాంటీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు తెర లేపుతున్నాడు.