సందీప్ రెడ్డి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి!
ఆ రకంగా చైతన్యకు `తండేల్` సక్సెస్ కూడా అంతే కీలకం. అయితే ఇక్కడే ఓ సెంటిమెట్ వర్కౌట్ అవ్వాల్సి ఉంది.
By: Tupaki Desk | 4 Feb 2025 6:29 AM GMTఅక్కినేని ఫ్యామిలీ సహా అభిమానులు ఆ కుటుంబానికి వంద కోట్ల క్లబ్ మూవీ ఎప్పుడు పడుతుందా? అని ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ అక్కినేని హీరోలెవరకూ కూడా 100 కో ట్ల మార్క్ ని టచ్ చేయలేదు. దీంతో `తండేల్` సినిమాతో యువ సామ్రాట్ నాగచైతన్య ఆ రికార్డు అందుకుంటాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రచార చిత్రాలన్నీ సినిమాకి మంచి పాజిటివ్ వైబ్ ని తీసుకొచ్చాయి. ఈ సినిమా తో పక్కాగా సెంచరీ కొట్టడం ఖాయమని అభిమానులు బలంగా విశ్వషిస్తున్నారు.
నాగచైతన్య కు కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. `మజిలీ` తర్వాత చైతన్యకు సరైన సోలో హిట్ పడలేదు. `బంగార్రాజు` హిట్ అయినా? అది డాడ్ నాగ్ తో కలిసి చేసిన చిత్రం. `లవ్ స్టోరీ` యావరేజ్ గా ఆడింది. `థాంక్యూ`, `లాల్ సింగ్ చడ్డా`, ` కస్టడీ` చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడం విఫలమయ్యాయి. ఆ రకంగా చైతన్యకు `తండేల్` సక్సెస్ కూడా అంతే కీలకం. అయితే ఇక్కడే ఓ సెంటిమెట్ వర్కౌట్ అవ్వాల్సి ఉంది.
`మజిలీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా గెస్ట్ గా విచ్చేసాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ చైతన్య నటించిన ఏ సినిమాకి సందీప్ అతిధిగా హాజరు కాలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సందీప్ రెడ్డి `తండేల్` సినిమాకే ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. `యానిమల్` విజయం తర్వాత అతడి క్రేజ్ పాన్ ఇండియాలో ఉంది. ఈ నేపథ్యంలో సందీప్ రావడం కొంత వరకూ కలిసొచ్చింది.
సందీప్ సైతం ఇదే విషయాన్ని గుర్తు చేసాడు. చైతన్య సినిమాకి అప్పుడు గెస్ట్ గా వచ్చాను. అది హిట్ అయింది. మళ్లీ ఇప్పుడు తండేల్ కోసం వచ్చాను. ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలన్నాడు. ఇలా విజయం అన్నది ఇద్దరి మధ్య ఓ సెంటిమెంట్ గా మారాలని అన్నారు. ఈ సందర్భంగా చైతన్య అభిమానుల విన్నపం కూడా ఒకటుంది. నాగచైతన్య తో సందీప్ ఓ కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాలని కోరుకుంటున్నారు.