వంగా ఆఫీస్ లో 'పులి రాజు' పిక్.. అసలు మ్యాటర్ ఇదేనా?
అప్పుడు కోపంతో రగిలిపోయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పిక్ నే ఇప్పుడు సందీప్ తన ఆఫీస్ లో పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 3 Feb 2025 9:58 AM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. నాగచైతన్య తండేల్ ఈవెంట్ లో ఆయన స్పీచ్ ఒక కారణమైతే.. తన ఆఫీస్ కు సంబంధించిన పిక్ షేర్ చేసుకోవడం మరో కారణం. వంగా కార్యాలయం ఫోటోలో అనేక ఇంగ్లీష్ చిత్రాల పోస్టర్స్ ఉన్నప్పటికీ.. మెగాస్టార్ పోస్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
చిరంజీవి నటించిన ఆరాధన మూవీలోని పోస్టర్ అది. అందులో ఆయన కోపంతో వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. భారతీరాజా దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సుహాసిని హీరోయిన్ గా యాక్ట్ చేశారు. తమిళ సూపర్ హిట్ కడలోర కవితైగల్ రీమేక్ గా రూపొందిన ఆ మూవీ.. 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళంలో బాగా ఆడినా.. తెలుగులో మాత్రం డిజాస్టర్ అయింది. కానీ ఇళయరాజా కంపోజ్ చేసిన సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా మెప్పిస్తున్నాయి. ఆడియో ఆల్బమ్ పరంగా ఓకే అయినా ఓవరాల్ గా ఫ్లాప్ గా నిలిచింది. అయితే చిరు డిజాస్టర్ మూవీ పోస్టర్ వంగా ఆఫీస్ లో ఉందన్నమాట!
దీంతో చిరు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నప్పటికీ.. ఆ ఫోటోనే వంగా ఎందుకు పెట్టుకున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆరాధన మూవీలో చిరు రోల్ పులిరాజు.. పొగరు, కోపంతో ఫుల్ గా నిండిపోయి ఉంటుంది. అతడి ప్రవర్తన చాలా దూకుడుగా, తన తల్లికి వ్యతిరేకంగా ప్రవరిస్తాడు.
అయితే సినిమాలో పులిరాజు జీవితంలోకి టీచర్ జెన్నిఫర్ రాగా.. మొత్తం మారిపోతాడు. ఓ సందర్భంలో తప్పు చేయగా.. టీచర్ పులిరాజు చెంపపై కొడుతుంది. అప్పుడు కోపంతో రగిలిపోయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పిక్ నే ఇప్పుడు సందీప్ తన ఆఫీస్ లో పెట్టుకున్నారు. బహుశా.. ఆయన పులి రాజు రోల్ నుంచి ఇన్స్పైర్ అయ్యారేమో మరి.
సినిమా బాగా ఆడకపోయినా, క్యారెక్టరైజేషన్, మెగాస్టార్ నటన సందీప్ వంగాను మంత్రముగ్ధులను చేసినట్లు అర్థమవుతోంది. ఏదేమైనా చిరు నుంచి ప్రేరణ పొందిన వారిలో ఆయన కూడా ఒకరు. అయితే సందీప్ తెరకెక్కించిన సినిమాల్లో హీరోలు కూడా సౌమ్యంగా అస్సలు ఉండరు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ ద్వారా మనమంతా చూశాం. ఆరాధనలో పులిరాజుకు మించిన కోపంతో ఉంటాయి సందీప్ వంగా హీరోల రోల్స్.