కబీర్ సింగ్, యానిమల్ సినిమాలకు రిఫరెన్స్‌గా చైతూ!
అంతేకాదు, రియల్ లైఫ్ లో చైతన్య వేసుకునే కాస్ట్యూమ్స్, లంబోర్ఘిని డ్రైవ్ చేసే విధానం అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన సందీప్, మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా తెలిపాడు.
By: Tupaki Desk | 3 Feb 2025 9:38 AM ISTఅక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా ఆ ఈవెంట్ కు సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా నాగ చైతన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం కొందరు వ్యక్తుల్ని చూసిన వెంటనే ఇష్టం కలుగుతుందని, పరిచయమున్నా లేకపోయినా వారిని ఇష్టపడతామని, తాను కేడీ సినిమాకు వర్క్ చేసేటప్పుడు చైతన్య ఆ సెట్స్ కి అప్పుడప్పుడూ వచ్చేవాడని, ఆ టైమ్ నుంచే తనకు చైతన్య అంటే ఇష్టమని వెల్లడించాడు సందీప్.
అంతేకాదు, రియల్ లైఫ్ లో చైతన్య వేసుకునే కాస్ట్యూమ్స్, లంబోర్ఘిని డ్రైవ్ చేసే విధానం అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన సందీప్, మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా తెలిపాడు. తన కబీర్ సింగ్, యానిమల్ సినిమాల కాస్ట్యూమ్ డిజైనర్‌కు మీరు రియల్ లైఫ్ లో వేసుకునే బట్టల ఫోటోలను రిఫరెన్స్ గా చూపించి హీరోకు అలాంటి స్టైలింగ్ కావాలని అడిగానని సందీప్ తెలిపాడు.
ఈ విషయాన్ని తానెప్పుడూ ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడే చెప్తున్నా అని సందీప్ ఈ సందర్భంగా అన్నాడు. తండేల్ సినిమాకు వర్క్ చేసిన ప్రతీ ఒక్కరినీ అభినందిస్తూ, సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
గతంలో చైతన్య సినిమా మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చానని, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని, ఇప్పుడు మళ్లీ తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చానని, ఈ సినిమా కూడా అలానే హిట్ అవాలని సందీప్ అన్నాడు. శ్రీకాకుళం మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా సక్సెస్‌పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.