సందీప్ రెడ్డి మెగా పవర్ ఫ్రేమ్!
ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా తన సినిమా ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్ కి సంబందించిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
By: Tupaki Desk | 3 Feb 2025 5:12 AM GMTఇండియాలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ గురించి అడిగితే అందులో సందీప్ రెడ్డి వంగా పేరు కూడా చాలా మంది చెబుతారు. కేవలం మూడు సినిమాలతోనే బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం తన గురించి చర్చించుకునేలా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ చేయగలిగాడు. మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ని సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కించడానికి ఇబ్బందులు పడిన తరువాత ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు.
రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ మూవీ చేసి సెన్సేషన్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సందీప్ రెడ్డి వంగా సొంతం చేసుకున్నాడు. అయితే అతని సినిమాలలో హీరో క్యారెక్టరైజేషన్ ఎక్స్ట్రీమ్ వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దీనిని కొంతమంది విమర్శించిన మెజారిటీ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోలు కూడా సందీప్ తో మూవీస్ చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా తన సినిమా ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్ కి సంబందించిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి రెట్రో స్టిల్ ని ఫ్రేమ్ గా చేసి పెట్టుకున్నాడు. దాంతో పాటు సందీప్ రెడ్డికి ఇష్టమైన సినిమాలని ఫ్రేమ్ కట్టించి ఆఫీస్ లో పెట్టుకున్నాడు. వాటిలో మార్టిన్ స్కోర్సెస్ టాక్సీ డ్రైవర్, డేవిడ్ ఫించర్స్ ఫైట్ క్లబ్, స్టాన్లీ కుబ్రిక్ యొక్క క్లాక్‌వర్క్ ఆరెంజ్ మరియు పాల్ థామస్ ఆండర్సన్ యొక్క దేర్ విల్ బి బ్లడ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి.
ముఖ్యంగా సందీప్ రెడ్డి షేర్ చేసిన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఫ్రేమ్ ఉండటంతో మెగా ఫ్యాన్స్ దీనిని వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి వంగా ఒక మూవీ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. గతంలో సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తాను హార్డ్ కోర్ మెగాస్టార్ చిరంజీవి అభిమానిని అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా విపరీతమైన అభిమానం అని తెలియజేశాడు.
సందీప్ రెడ్డి యంగ్ ఏజ్ లో పవన్ కళ్యాణ్ పోస్టర్ పక్కన కూర్చొని తీసుకున్న ఫోటో కూడా వైరల్ అయ్యింది. అలాగే అతను పవన్ కళ్యాణ్ నటించిన వాటిలో తనకిష్టమైన సినిమా పోస్టర్స్ ని గతంలో ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి డార్లింగ్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది.
మెగా హీరోలతో సందీప్ రెడ్డి వంగా తన స్టైల్ లో అదిరిపోయే కథతో మూవీ చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కచ్చితంగా భవిష్యత్తులో ఇది సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ తో సందీప్ రెడ్డి వంగా సినిమా ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.